
గర్మిళ్ల, ఆగస్టు 17 : మం చిర్యాల జిల్లా కేంద్రం లోని తోళ్లవాగులో పడి కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రం లోని అశోక్ రోడ్డులో నివాసం ఉంటున్న గూడెపు శ్రీనివాస్ (45) మంచిర్యాల ప్రభుత్వ దవాఖా నలో కాంట్రాక్ట్ పద్ధతిన (ధోబీ) పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం దవాఖానలోని బెడ్ షీట్లు, ఇతర బట్టలు ఉతకడానికి తోళ్లవాగుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు వాగులో పడి మృ తి చెందాడు. అతడికి భార్య భారతి, కూతుళ్లు సాయిశ్రీ,అఖిల ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీ సులు తెలిపారు.