బేల, జూన్ 14 : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ పేర్కొన్నారు. మండలంలోని మసాల, శంషాబాద్, ఎకోరి, అవల్పూర్, సిర్సన్న గ్రామాల్లో సవారీ బంగ్లా కమ్యూనిటీ షెడ్డు నిర్మాణానికి మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలతో పాటు కమ్యూనిటీ షెడ్డు, కుల సంఘాల భవనాలు ఏర్పాటు చేస్తుందని అన్నారు. బడిబాటలో భాగంగా పలు గ్రామాల్లో తీసిన ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు గంభీర్ ఠాక్రే, ప్రమోద్ రెడ్డి, సతీశ్పవార్, సుదర్శన్, సర్పంచ్లు పాల్గొన్నారు.