సిరికొండ, జూన్ 14 : పల్లె ప్రగతి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని రిమ్మ, కొండాపూర్ గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కొండాపూర్ గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. గ్రామంలో మురుగు నిల్వ ఉండకుండా చూడాలని, ప్లాస్లిక్ వాడకాన్ని నిషేధించాలని అధికారులకు సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను రిమ్మ సర్పంచ్ పెందూర్ అనిల్ కుమార్ సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ అమృత్ రావ్, ఎంపీడీవో సురేశ్, తహసీల్దార్ సర్పరాజ్, ఉపాధి హామీ ఏపీవో జాదవ్ శేషరావ్, టీఏ సుభాశ్, ధన్‌రాజ్, కార్యదర్శులు శ్రీనివాస్, అరుణ్, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
గ్రామీణ ప్రాంతాల పిల్లలకు మెరుగైన విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండలంలోని ఏమాయికుంట, బీక్కుతండా గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏమాయికుంట పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఇంగ్లిష్ మీడియంను ఆమె ప్రారంభించారు. ఎంపీపీ పోటే శోభాబాయి, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అంజద్, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, పడ్వాల్ విజయ్‌సింగ్, సర్పంచ్‌లు జాదవ్ లఖన్సింగ్, ఆడే విజయ, రాథోడ్ శారద, టీఆర్ఎస్ నాయకులు మారుతి, సుఫియాన్, రాందాస్ పాల్గొన్నారు.