నార్నూర్, జూన్ 13 : విద్యా రంగంలో రాష్ర్టాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యామని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మన ఊరు-మన బడి కింద మండలంలోని తాడిహత్నూర్ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసి, పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని భావించిన సీఎం కేసీఆర్, ఆ దిశగా గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. అలాగే ప్రల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పర్చుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, ఎంపీడీవో రమేశ్, ఎంఈవో రాపెల్లి ఆశన్న, ఉప సర్పంచ్ ఫడ్ విష్ణు, మాజీ ఎంపీటీసీ శేషరావ్, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ రాథోడ్ దత్తా, ప్రధానోపాధ్యాయుడు జాదవ్ గణేశ్, జీవవైవిధ్య కమిటీ జిల్లా సభ్యుడు మర్సుకోల తిరుపతి, కనక ప్రభాకర్, మెస్రం మానిక్రావ్, మడావి సాగర్ తదితరులున్నారు.
ఉట్నూర్ రూరల్, జూన్ 13 : బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఏంక గ్రామంలోని పాఠశాలను జడ్పీ చైర్మన్ సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. వారికి పలకలు, బల్పాలు అందిచి, అక్షరాభ్యాసం చేయించారు. ఈ కాక్రమంలో సర్పంచ్ మనోజ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాథోడ్ గణేశ్, జీవ వైవిధ్య కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి, పాఠశాల కమిటీ చైర్మన్ కేంద్రె మహేశ్, పండరీ పటేల్, డిగంబర్ పటేల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.