ఉట్నూర్ రూరల్, జూన్ 13 : మండలంలోని నర్సాపూర్(జీ), హీరాపూర్(జీ) గ్రామాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పర్యటించారు. సమస్యలను తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. పల్లె ప్రగతిలో తాగునీరు, శానిటేషన్, కరంటు సమస్యలను గుర్తించి అధికారులు పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరాం, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీడీవో తిరుమల, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు రషీద్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు అజీమొద్దీన్, ఏపీవో రజనీకాంత్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, నాయకులు జవ్వాద్ అన్సారీ, జగ్జీవన్, భూమన్న పాల్గొన్నారు.
బజార్హత్నూర్లో..
బజార్హత్నూర్, జూన్13 : మండలంలోని కోల్హారి, చందూనాయక్ తండా, డేడ్రా, జాతర్ల గ్రామాల్లో కలెక్టర్ సిక్తా పట్నానాయక్ ఆకస్మికంగా సందర్శించారు. కోల్హారి పాఠశాలలో అభివృద్ధి, వైకుంఠధామం, డంప్‌యార్డు పనులను పరిశీలించారు. చందునాయక్‌తండా, డేడ్రా, జాతర్లలో కలియదిరిగారు. చం దూనాయక్తండాలో క్రీడా ప్రాంగణాన్ని ఎంపీపీ అజిడే జయశ్రీతో కలిసి ప్రారంభించారు. డేడ్రాలో పల్లెపార్కును పరిశీలించారు. సర్పంచులు గంగా, అనిత, లక్ష్మి, ఎంపీపీ అజీడే జయశ్రీ, జడ్పీసీఈవో గణపతి, తహశీల్దార్ కూన గంగాధర్, ఎంపీడీవో మహేందర్ రెడ్డి, పంచాయతీ శీఖ ఈఈ, ఏపీవో శ్రీ నివాస్, ఆయా శాఖల అధికారులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బేలలో..
బేల, జూన్ 13 : మండలంలోని గూడ, దహిగాం, కాంగార్పూర్, మణియార్‌పూర్, బెదోడ, కాప్సి తదితర గ్రామాల్లో డీపీవో శ్రీనివాస్ పనులను పరిశీలించారు. సమస్యలపై సర్పంచులు, కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో భగత్ రవీందర్, ఎంపీవో సమీర్ హైమద్, మణియార్‌పూర్ గ్రామ స్పెషల్ ఆఫీసర్ శరత్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్‌లో..
నార్నూర్, జూన్ 13 : నార్నూర్ మండల కేంద్రంతో పాటు గంగాపూర్, మహాగావ్, ఖైరదట్వా పంచాయతీలను డివిజన్ పంచాయతీ అధికారి భిక్షపతి గౌడ్ పర్యటించారు. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలిస్తూ వివరాలు తెలుసుకున్నారు. పారిశుధ్యం, మొక్కల సంరక్షణపై దృష్టిపెట్టాలన్నారు. చెత్తరహిత గ్రామాలే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ఈయన వెంట ఎంపీవో స్వప్నశీల, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
సిరికొండలో..
సిరికొండ, జూన్ 12 : మండలంలోని లచ్చింపూర్(బీ), బోరింగ్గూడ పాఠశాలలను ఎంపీడీవో సురేశ్ సందర్శించారు. పంచాయతీ సిబ్బంది పాఠశాలలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ అమృత్ రావ్, ఉపాధి హామీ ఏపీవో జాదవ్ శేషరావ్, కార్యదర్శి మిలాన్, సర్పంచ్ నర్మద, గ్రామస్తులు భంగవంత్ రావ్ తదితరులు పాల్గొన్నారు.
బోథ్‌లో..
బోథ్, జూన్ 13 : మండలంలోని వజ్జర్ పంచాయతీని బోథ్ ఎంపీడీవో దుర్గం రాజేశ్వర్ సందర్శించారు. ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్డు, నర్సరీలను పరిశీలించారు. అనంతరం క్రీడా ప్రాంగణం కోసం అనువైన స్థలాన్ని ఈజీఎస్ ఏపీవో జగ్దేరావుతో కలిసి పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ భూంబాయి, దేవురావు తదితరులున్నారు. బాబెరలో ప్రత్యేకాధికారి శ్యాంసుందర్‌రెడ్డి పరిసరాలను పరిశీలించారు. అవసరమైన చోట బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. కార్యక్రమంలో సర్పంచ్ సురేశ్, జీపీ కార్యదర్శి కాశీరాం, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇచ్చోడలో..
ఇచ్చోడ, జూన్ 13 : మండలంలోని మాదాపూర్, పట్వారీగూడ గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను ఎంపీవో కొమ్ము రమేశ్ పరిశీలించారు. గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్త్తను పంచాయతీ కార్మికులతో తొలగించారు. పల్లె ప్రగతి పనులపై నిర్లక్ష్యం తగదని అధికారులకు సూచించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి భోజారెడ్డి, సిబ్బంది తదితరులున్నారు.
నేరడిగొండలో..
నేరడిగొండ, జూన్ 13 : మండలంలోని బోందిడి, రెంగన్వాడీ, సుర్దాపూర్, దంశనాయక్తండాల్లో ఎంపీడీవో అబ్దుల్ సమద్ పర్యటించారు. బోందిడిలో క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ పవన్‌చంద్ర, ఈజీఎస్ ఏపీవో వసంత్‌రావ్, గిర్దావర్ నాగోరావ్, సర్వేయర్ శంకర్, సర్పంచ్ ఆడె అనిత, నాయకులు జనార్దన్, పంచాయతీ కార్యదర్శి రజిత, గ్రామస్తులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంద్రవెల్లిలో..
ఇంద్రవెల్లి, జూన్ 13 : మండలంలోని ఆంధ్గూడహర్కాపూర్ గ్రామపంచాయతీలో ఎంపీవో సంతోష్ పనులను పరిశీలించారు. శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కిరాణా దుకాణాల్లో ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తే చర్యలు తీసుకోవాలని తెలిపారు. సర్పంచ్ కుడే కైలాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రవెల్లి, ముత్నూర్, సమక, గౌరాపూర్, కెస్లాపూర్ పంచాయతీల్లో సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు.