భీంపూర్, జూన్ 13 : విద్య, ఉద్యోగ అవకాశాల్లో రాష్ట్రం మేటి అని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఆయన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. పల్లె ప్రగతిలో పాల్గొన్నారు. మొక్కలకు నీరు పోశారు. పిప్పల్‌కోటి రిజర్వాయర్‌తో వేల ఎకరాలు సస్యశ్యామలమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, ఎంపీపీ కుడిమెత రత్నప్రభ, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, సర్పంచులు మడావి లింబాజీ, భూమన్న, అజయ్, కృష్ణ, ప్రత్యేకాధికారి గోపీకృష్ణ, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ మహేందర్, ఉప సర్పంచ్ రవీందర్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అనిల్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య యాదవ్, నాయకులు ఉత్తం రాథోడ్, జీ నరేందర్ యాదవ్, బక్కి కపిల్ యాదవ్, కో ఆప్షన్ మెంబర్ జహూర్ అహ్మద్, గ్రామస్తులు ఉన్నారు.