ఆదిలాబాద్ రూరల్, జూన్ 12 : వేసవి సెలవులు ముగియగా, నేటి నుంచి బడిగంట మోగనున్నది. నిన్నామొన్నటి దాకా.. ఆటా పాటల్లో మునిగి తేలిన విద్యార్థులు పాఠశాలలకు చేరే వేళైంది. ఇప్పటికే బడిబాట కార్యక్రమం కొనసాగుతుండగా, ఉపాధ్యాయ లోకం పిల్లలను చేర్పిస్తున్నది. ‘మన ఊరు-మనబడి’లో భాగంగా ఈ ఏడాది నుంచే ఆంగ్ల విద్య ప్రారంభిస్తుండగా, ప్రభుత్వం అందుకనుగుణంగా స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. రూపాయి ఖర్చు లేకుండా నిరుపేద పిల్లలకు మెరుగైన విద్యనందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నది.
వేసవి సెలవుల అనంతరం జిల్లాలో పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది నుంచి సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను కూడా ప్రారంభించేందు కు జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పా ట్లు చేశారు. ఇప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమం బోధనపై శిక్షణ ఇచ్చా రు. ‘మన ఊరు- మన బడి’ లో భాగంగా స ర్కారు బడులను కార్పొరేట్‌కు దీటుగా మా ర్చేందుక ప్రణాళికలు రూపొందించారు. ప్రతి జిల్లాకు అడ్వాన్స్ కింద రూ.2 కోట్లను కేటాయించింది. కరోనా కారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికి పోయారు. వా రంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో గతం కంటే అడ్మిషన్లు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇదిలాఉం టే అడ్మిషన్లు పెంచేందుకు ఉపాధ్యాయులు ‘బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
పాఠశాలల్లో పరిశుభ్రత..
పట్టణ , పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా రెండు రోజులుగా ప్రభుత్వ పాఠశాలలను ము న్సిపల్, పంచాయతీ సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగి స్తూ, డ్రైనేజీలు, బాత్రూంలను శుభ్రం చేశా రు. ప్రారంభం రోజు మామిడి తోరణాలు, బె లూన్లతో స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్కెట్లో స్కూల్‌బ్యాగులు, పుస్తకాలు, నోట్‌బుక్స్ అమ్మేందుకు వ్యాపారు లు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
‘మన ఊరు-మనబడి’..
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పనుల ప్రారంభానికి ముందస్తుగా రూ.2 కోట్లు విడుదల చేసింది. దీంతో పనులు ఏప్రిల్ చివరి వారంలో చాలా పాఠశాలల్లో ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయితే వసతుల సమస్య తీరి విద్యార్థులు హాయిగా చదువుకోగలుగుతారు.
1439 పాఠశాలలు..
జిల్లావ్యాప్తంగా అన్ని మేనేజ్మెంట్లను కలుపుకొని 1439 పాఠశాలలు ఉన్నాయి. ఇందు లో సుమారు 13,9421 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏక రూప దుస్తులు, పుస్తకాలు ఎమ్మార్సీ కేంద్రాలకు చేరుకుంటున్నా యి. ఈనెల చివరిలోగా అన్ని పాఠశాలలకు పుస్తకాలు అందిస్తామని డీఈవో పేర్కొన్నారు.
పండుగలా ప్రారంభిస్తాం..
జిల్లాలో సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మొదటి రోజు విద్యార్థులను ఆకర్షించేందుకు బెలూన్లు, మామిడితోరణాలతో స్వాగతం పలకనున్నారు. స్కూళ్లను ముందే గ్రామపంచాయతీ, మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించాం.
–టామ్నె ప్రణీత, డీఈవో ఆదిలాబాద్