నిర్మల్ అర్బన్, జూన్ 12 : దేశంలో హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్‌లో ఆదివారం ఛత్రపతి శివాజీ పట్టాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చైర్మన్ ఈశ్వర్ శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నేరెళ్ల వేణు, పూదరి రాజేశ్వర్, గండ్రత్ రమణ, బిట్లింగ్ నవీన్, లక్కాకుల నరహరి, నాయకులు అడ్ప పోశెట్టి, పద్మాకర్, నర్సాగౌడ్ ఉన్నారు.
ఘనంగా శివాజీ పట్టాభిషేకం
నిర్మల్ టౌన్/సోన్, జూన్ 12 : పట్టణంలోని మంచిర్యాల చౌరస్తాలో శివాజీ సేవాసమితి ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసం శివాజీ చేసిన పోరాటం నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు మెడిసెమ్మ రాజు, రాజేశ్వర్‌రెడ్డి, అలివేలు, విలాస్, రవీందర్, అశోక్, మల్లికార్జున్‌రెడ్డి, అంజుకుమార్, విలాస్, వెంకటపతి పాల్గొన్నారు. సోన్ మండలం న్యూవెల్మల్ బొప్పారంలో బీజేపీ నాయకులు శివాజీ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేఏశారు. కార్యక్రమంలో నాయకులు ప్రేమ్‌కుమార్, రాచకొండ సాగర్, శ్రీనివాస్, సాయన్న, నరేశ్, మల్లేశ్, వెంకటేశ్, ప్రశాంత్, గణేశ్, దిలీప్, వినోద్, సంతోష్, జితేంద్ర, ప్రవీణ్ పాల్గొన్నారు.