విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న దృష్ట్యా బాసర ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. గురువారం అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరశ్రీకారాలు చేయించారు. రూ.1000 అక్షరాభ్యాసాలు 513, రూ.100వి 531, మొత్తం 1,044 అయ్యాయి. ఆదాయం రూ.9.50 లక్షలు సమకూరగా.. దాదాపు 15వేల మంది భక్తులు దర్శించుకున్నారు. – బాసర, జూన్ 9