
ఎదులాపురం ఆగస్టు15: 75వ స్వాతంత్య్ర దిన వేడుకలు జిల్లాలో ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. వాడవాడనా మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడింది. కలెక్టర్ బంగ్లాలో జాతీయ జెండాను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎగురవేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర మహనీయుల చిత్రపటాలకు పూలమాలలువేసి నివాళులర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్లు, నటరాజ్, డేవిడ్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జగ్జీవన్‌కుమార్ జెండాను ఎగురవేశారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ జాతీయ జెండాను ఎగురవేశారు.
ఇక్కడ ఎమ్మెల్యే జోగు రామన్న, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, జడ్పీ సీఈవో గణపతి పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జోగు ప్రేమేందర్, జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో రవీందర్‌రెడి, వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డాక్టర్ నరేందర్ రాథోడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, అడిషనల్ డీఎంహెచ్‌వో శ్రీకాంత్, డీఎంవో శ్రీధర్, డీఐవో విజయసారథి ఉన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలో జీఎం పద్మభూషణ్ రాజు, సిబ్బంది సత్యనారాయణ, ఐసీడీఎస్ కార్యాలయంలో పీడీ మిల్కా, బీసీ కార్యాలయంలో ఆ శాఖ అధికారి రాజలింగు, డీఎస్సీడీవో భగత్ సునీత, జాతీయ జెండాలు ఎగురవేశారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న శాంతినగర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. గాంధీచౌక్, అంబేద్కర్‌చౌక్‌లో గాంధీ, అంబ్కేదర్ విగ్రహాలకు మాజీ ఎంపీ నగేశ్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగురవేసి, క్యాంప్ కార్యాలయంలో మాజీ సైనికులను సత్కరించారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కార్గిల్ పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. మున్సిపల్ కమిషనర్ ఆదుముల్ల శైలజ, వార్డు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
దేవీచంద్చౌక్లో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జగదీశ్ అగర్వాల్ జెండాను ఆవిష్కరించారు. జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. సంఘం అధ్యక్షుడు నగేశ్, ప్రధాన కార్యదర్శి నానయ్య పాల్గొన్నారు. సుందరయ్యనగర్ అంగన్వాడీ సెంటర్-1లో కార్యకర్త రాధ జాతీయ జెండాను ఎగురవేశారు. సార్క్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీచర్స్ కాలనీలో ఉమ్మడి జిల్లా చైర్మన్ గుర్రం పుణ్యంరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్, సభ్యులు పాల్గొన్నారు. జిల్లా మాజీ సైనికుల సంఘ భవనంలో జిల్లా అధ్యక్షుడు శంకర్‌దాస్ జెండాను ఆవిష్కరించారు. గౌరవాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, సభ్యులు ఉన్నారు.
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 15: జిల్లా కేంద్రంలోని రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సెవ్వ లక్ష్మి జాతీయ జెండాను ఎగురవేశారు. వైస్ ఎంపీపీ రమేశ్, ఎంపీటీసీలు గంగాధర్, జంగు పటేల్, సెవ్వ జగదీశ్, ఎంపీడీవో భూక్యా శివలాల్, ఎంఈవో జయశీల పాల్గొన్నారు. మావల మండలం బట్టిసావర్గంలో సర్పంచ్ రాగం గంగమ్మ, వాఘాపూర్‌లో సర్పంచ్ మయూరి, మావల జీపీలో సర్పంచ్ దొగ్గలి ప్రమీల, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ చందాల ఈశ్వరి జాతీయ జెండాలు ఎగుర వేశారు. జడ్పీటీసీ నల్లా రాజేశ్వరి, ఎంపీడీవో అరుణ, వైస్ ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, నల్లా రాజేశ్వర్, రాజన్న పాల్గొన్నారు.
పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ రాజేశ్‌తో కలిసి పోలీసులు, ఎన్సీసీ, స్కౌట్స్ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన శకటాల ప్రదర్శనను తిలకించారు. పట్టణంలోని లిటిల్ స్టార్, కేజీబీవీ, చైతన్య హైస్కూల్, కవిత మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి.
బేల, ఆగస్టు 15 : బేల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఇంద్రశేఖర్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సాయన్న, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం కిరణ్ కుమార్, మండల సమాఖ్య అధ్యక్షురాళ్లు, ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ వనిత, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏఈవో, ఆటవీశాఖ కార్యాలయంలో ఎఫ్ ఆర్వో అరుణ, ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను గ్రామ పెద్ద అశోక్ గుండావార్ ఎగురవేశారు నాయకులు గంభీర్ ఠాక్రే, సతీశ్‌పవార్. దేవన్న, తన్వీర్ ఖాన్, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
తాంసి, ఆగస్టు 15: తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో కార్యాలయంలో వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ, పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఎస్సై ధనశ్రీ, ప్రాథమిక సహకారం సంఘంలో వైస్ చైర్మన్ పర్ధాన్ ధనుంజయ్, గ్రామ పంచాయతీలో సర్పంచ్ స్వప్నారత్నప్రకాశ్ జెండాను ఎగురవేశారు. ఎంపీడీవో ఆకుల భూమయ్య, ఎంపీటీసీలు వన్నెల నరేశ్, అశోక్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో డీఏవో రమేశ్ జెండాను ఆవిష్కరించారు. జిల్లా నోడల్ అధికారి శివకుమార్, ఏవోలు కైలాస్, రమేశ్, అష్రాఫ్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఉద్యానశాఖ కార్యాలయంలో ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్త శ్రీధర్‌చౌహాన్ జాతీయ జెండాలు ఆవిష్కరించారు. శాస్త్రవేత్తలు రాజశేఖర్, మోహన్‌దాస్, రాజేందర్‌రెడ్డి, శ్రీకాంత్, ఎస్ఆర్ఎఫ్ రాములు, సిబ్బంది పాల్గొన్నారు. పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో జిల్లా పశువైద్యాధికారి రంగారావు జెండాను ఆవిష్కరించారు. ఏడీఏలు రామారావు రాథోడ్, గోపీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
జైనథ్, ఆగస్టు 15: ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ మహేంద్రనాథ్, వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏవో వివేక్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సాయిరెడ్డి వెంకన్న, ప్రాథమిక సహకార సంఘంలో చైర్మన్ బాలూరి గోవర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ ఆవరణలో కార్యదర్శి మధుకర్, జడ్పీ పాఠశాలలో హెచ్ఎం లస్మన్న, ఐకేపీ కార్యాయంలో ఎంఎస్ అధ్యక్షురాలు రూప జెండాలు ఆవిష్కరించారు. జడ్పీటీసీ తుమ్మల అరుంధతి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు లింగారెడ్డి, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, ఆగస్టు15: తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ రాఘవేంద్రరావు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పోటే శోభాబాయి, ఇంద్రవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంతోపాటు అంబేద్కర్ విగ్రహం వద్ద సర్పంచ్ కోరెంగా గాంధారి, ఏఎంసీ కార్యాలయంలో చైర్మన్ రాథోడ్ మోహన్‌నాయక్, పీఏసీఎస్‌లో చైర్మన్ మారుతి డోంగ్రే, అటవీశాఖ కార్యాలయంలో ఎఫ్ఆర్వో శ్రీనివాస్, విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈ చంద్రశేఖర్, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం రాథోడ్ రామారావ్, పీహెచ్సీలో వైద్యుడు శ్రీకాంత్, పశువైద్యశాఖలో వైద్యుడు సుదేశ్, పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ నాగ్నాథ్, గ్రంథాలయంలో అధికారి కాంబ్లే వెంకటి, జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు గోపాల్‌సింగ్ తిలావత్ జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, ఎంపీడీవో పుష్పలత, జడ్పీటీసీ పుష్పలత, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అంజాద్, మండల కోఆప్షన్ సభ్యుడు జిలానీబేగ్, వైస్ ఎంపీపీ పడ్వాల్ గోపాల్‌సింగ్, ఇంద్రవెల్లి ఉప సర్పంచ్ తైహిరే గణేశ్, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, ఆశాబాయి, భీంరావ్, మధుకర్, నాయకులు వెంకట్రావ్, ఆర్కా కమ్ము, మసూద్, దేవ్‌పూజె మారుతి, కోరెంగా సుంకెట్రావ్, కదం మహేశ్, హరిదాస్, సాయినాథ్, సుఫియాన్, శివాజీ, నాగోరావ్ పాల్గొన్నారు.