గుడిహత్నూర్, జూన్ 9 : పరిసరాల శుభ్రత అందరి బాధ్యత అని ఆదిలాబాద్ ఆర్డీవో రాథోడ్ రమేశ్ పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని కాలనీల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో సమస్యలు పరిష్కరించడానికే ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ సునీత, ఎంపీపీ భరత్, జడ్పీటీసీ బ్రహ్మానంద్, తహసీల్దార్ సంధ్యారాణి, నాయకులు జాదవ్ రమేశ్, అంకతి రవీందర్ పాల్గొన్నారు.
పల్లె ప్రగతిలో భాగస్వాములు కావాలి
సిరికొండ, జూన్ 9 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని మండల ప్రత్యేకాధికారి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని మల్లాపూర్, కన్నపూర్, సిరికొండ గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను సందర్శించారు. మొక్కలు నాటారు. ఆయన వెంట ఎంపీడీవో సురేశ్, మల్లాపూర్ సర్పంచ్ బాపురావ్, ఉపసర్పంచ్ శ్యాంరావ్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, గ్రామపెద్ద రమేశ్ ఉన్నారు.
తడి, పొడి చెత్త విధానంపై అవగాహన కల్పించాలి
బోథ్, జూన్ 9: తడి, పొడి చెత్త వేరు చేసే విధానంపై స్వయం సహాయక సంఘాల సభ్యులు మహిళలకు అవగాహన కల్పించాలని మండల పంచాయతీ అధికారి జీవన్‌రెడ్డి సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని కౌఠ(బీ) గ్రామంలో ఎస్‌హెచ్‌జీ గ్రూపు లీడర్లు, సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గంగాధర్, ఐకేపీ సీసీ, పంచాయతీ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.
భీంపూర్, జూన్ 9 : మండలంలోని నిపాని గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో మండల ప్రత్యేకాధికారి గోపీకృష్ణ, గ్రామ ప్రత్యేకాధికారి ఆది, సర్పంచ్ భూమన్న మొక్కలు నాటారు. మురుగుకాలువలు శుభ్రం చేయించారు. పలు గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో సర్పంచ్‌లు స్వాతిక, ప్రతాప్, భూమన్న, పెండెపు కృష్ణయాదవ్, లావణ్య, పంచాయతీ కార్యదర్శులు సునీత, నితిన్ పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ఆధారం
ఇంద్రవెల్లి, జూన్ 9 : పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ఆధారమని ఎంపీపీ పోటే శోభాబాయి అన్నారు. మండలంలోని దస్నాపూర్‌లో గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. నాటిన మొక్కలు సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు సాయినాథ్, పంచాయతీ కార్యదర్శి సుల్తానా, సిబ్బంది పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పనుల పరిశీలన
ఇచ్చోడ, జూన్ 9 : మండలంలోని ముక్రా(బీ) గ్రామంలో పల్లె ప్రగతి పనులను మండల ప్రత్యేకాధికారి బర్నోబా పరిశీలించారు. మురుగు కాలువ, కల్వర్టు నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. అనంతరం నర్సరీలో పెరుగుతున్న మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ అడవ్ మారుతి, ఉపసర్పంచ్ శివాజీ, వీడీసీ చైర్మన్ అశోక్, దేవ్‌రావ్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, జూన్ 9: మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని బీర్సాయిపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్, ఎంపీడీవో తిరుమల పరిశీలించారు. పనులను నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అనంతరం పల్లె ప్రగతిలో భాగంగా బీర్సాయిపేట, దంతన్‌పల్లి, హీరాపూర్, దొంగచింత, గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు, శానిటేషన్ పనులు పరిశీలించారు. పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి నారాయణ, ఏపీవో రజినీకాంత్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతితోనే సమస్యలు పరిష్కారం
బజార్హత్నూర్, జూన్ 9 : పల్లె ప్రగతితోనే గ్రామాల్లో సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాత్రి పల్లె ప్రగతిలో భాగంగా జాతర్ల గ్రామ పంచాయతీ భవనంలో అధికారులతో కలిసి పల్లెనిద్ర చేశారు. గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గురువారం మండలంలోని చందునాయక్‌తండా, బజార్హత్నూర్, జాతర్ల, రాంపూర్, డేడ్రా, భూతాయి(కే) గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. జాతర్ల పంచాయతీ కార్యాలయ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఎంపీడీవో మహేందర్‌రెడ్డి, ఏపీవో శ్రీనివాస్, ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
తాంసి, జూన్ 9: మండలంలోని గ్రామాల్లో అధికారులు పల్లె ప్రకృతి వనాల్లో, రహదారుల వెంబడి మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వించారు. కార్యక్రమంలో డీటీ విష్ణు, ఏవో రవీందర్, ఏపీఎం రవీందర్, ఏపీవో విజయ, ఏఎస్వో దయాకర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, జూన్ 9 : పల్లె ప్రగతి, మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ మండలం యాపల్‌గూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న పనులను అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. అనంతరం నర్సరీ, పల్లె ప్రకృతి వనం, శానిటేషన్ చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతువేదిక జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఆయన వెంట అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
నార్నూర్, జూన్ 9 : గాదిగూడ మండలం సావ్రి, పర్సువాడ(కే) గ్రామాల్లో చేపడుతున్న పల్లె ప్రగతి పనులను ఎంపీవో షేక్ ఖలీమ్ హైమద్ పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్‌లు కొడప మోతుబాయి, రాహుల్, పంచాయతీ కార్యదర్శులు సునీల్‌కుమార్, ప్రశాంత్, వార్డు సభ్యులు, నాయకులు ఉన్నారు.