భైంసా, జూన్ 9 : పల్లెలు, పట్టణాలను అందరూ శుభ్రంగా ఉంచాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. భైంసాలో ని 9వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్ర మాన్ని గురువారం కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రోడ్డుకు ఇరు వైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి డ్రైనేజీ లను శుభ్రం చేయాలన్నారు. వార్డుల్లో మొక్కలు నాట డానికి అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించా లన్నారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు సమీపంలో ఉన్న క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు.
దేగాంలో..
భైంసాటౌన్, జూన్ 9 : దేగాం గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హే మంత్ బోర్కడేతో కలిసి పరిశీలించారు. వసతు లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం లోని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు, నాయకులకు సలహాలు, సూచనలు చేశారు. ఆర్డీవో లోకేశ్వర్‌రావు, తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిప ల్ కమిషనర్ అలీం, ఎంపీడీవో అర్ల గంగాధర్, సర్పంచ్ బొబ్బి లి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సూర్యంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సిజేరియన్లు తగ్గించాలి
నిర్మల్ టౌన్, జూన్ 9 : ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ప్రసవాల కోసం వచ్చిన గర్భిణులకు సాధారణ కాన్పులను ప్రోత్సాహిస్తూ కడుపు కోతలను తగ్గించాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో సిజేరియన్ కాన్పులు తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాల ని కోరారు. పీహెచ్‌సీలు, సామాజిక దవాఖానల్లో వైద్య సిబ్బంది గర్భిణులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ సాధారణ కాన్పులను ప్రోత్స హించాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం 60 శాతం మాత్రమే సిజేరియన్ కేసులు నమోదవుతున్నాయని, వచ్చే నెల 20 శాతానికి తగ్గించాలని కోరారు. ఎక్కువ సిజేరియన్ చేసే దవాఖానలపై కఠిన చర్యలు తీసు కోవాలని సూచించారు. పీహెచ్‌సీల వారీగా ప్రసూతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్, వైద్యులు డాక్టర్ దేవేందర్‌రెడ్డి, కాశీనాథ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఎల్లపెల్లి శివారులోని ఈవీఎం గోదాంలను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ రాంబాబు తనిఖీ చేశారు. ప్రతినెలా గోదాంల తనిఖీలో భాగంగా అధికారులు అక్కడ ఉన్న ఈవీఎంలను పరిశీలిం చి రికార్డులను సరి చూశారు.
స్వచ్ఛ పల్లెల కోసమే పల్లె ప్రగతి
సోన్, జూన్ 9 : స్వచ్ఛమైన పరిశుభ్రమైన వాతావరణం కోసమే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. నిర్మల్ మండలం చిట్యాల్ గ్రామంలోని రైతు వేదికలో పల్లె ప్రగతి కార్యక్ర మంపై అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబుతో కలిసి తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వివిధ సంక్షేమ పథకాలు జాప్యం లేకుండా అమలయ్యేలా చూడాలన్నారు. క్రీడా ప్రాంగణాలు, మొక్కల పెంపకం, సీజనల్ వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ్ద వహించాలని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాల ని అధికారులకు సూచించారు. కడెం, దస్తురా బాద్, పెంబి మండలంలో స్థల సేకరణ త్వరగా చేపట్టాలని ఆదేశించారు. ఇంటితోపాటు పరిసరా లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు.