నిర్మల్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన బృహత్తర సంకల్పం విద్యాశాఖ రూపురేఖలు మార్చబోతున్నది. ‘మనఊరు- మనబడి’ అమలుతో సర్కారు బడులు కార్పొరేట్ హంగులు సం తరించుకోనున్నాయి. ఈ పథకానికి తోడు ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడి యం తప్పనిసరి చేయనుండడంతో సర్కారు విద్యకు కొత్త శకం ఆరం భం కాబోతున్నది. నిర్మల్ జిల్లాలో మొత్తం 835 ప్రభుత్వ పాఠశాల లు ఉండగా, ఈ విద్యా సంవత్సరానికి గాను ‘మన ఊరు-మనబడి’ పథకం కింద మొదటి విడుతలో 260 బడులను ఎంపిక చేశారు. ఇలాంటి సౌకర్యాల కల్పన కారణంగా కేవలం 9 రోజుల్లోనే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 20 వేల వరకు కొత్త విద్యార్థులు చేరనున్నారని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 13 నుంచి పాఠశాల లు తెరుచుకోబోతున్న నేపథ్యంలో జిల్లా విధ్యాశాఖాధికారి డాక్టర్ ర వీందర్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..
నమస్తే తెలంగాణ: ‘మనఊరు-మనబడి’ అమలు ఎంత వరకు వచ్చింది?
డీఈవో: జిల్లాలో 260 పాఠశాలలను ‘మన ఊరు-మనబడి’ ంద ఎంపిక చేశాం. వీటిలో రూ.30 లక్షల్లోపు ఉన్న 152 పాఠశాలల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మిగతా పాఠశాలల పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది. పనులు కొద్దిరోజుల్లోనే పూర్తి చేస్తాం.
జిల్లాలో మొత్తం ఎన్ని పాఠశాలలు ఉన్నాయి?
జిల్లాలో మొత్తం 835 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో ఎంపీ పీ, జడ్పీ పాఠశాలలు 695, ప్రభుత్వ పాఠశాలలు 35, డీఎన్టీ పాఠశాలలు 5 ఉన్నాయి. 18 కస్తూర్బా పాఠశాలలు, ఒక మోడల్ స్కూల్, మరికొన్ని ఇతర రెసిడెన్షియల్ పాఠశాలలు కొనసాగుతున్నాయి.
ఇంగ్లిష్ మీడియం బోధన కోసం ఎలా సన్నద్ధతమవుతున్నారు?
ఈ విద్యా సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధనను అమలు చేయబోతున్నాం. దీనికోసం ఇప్పటికే టీచర్లందరికీ శిక్షణ కూడా పూర్తి చేశాం. ఈ సారి ఇంగ్లిష్ మీడియం పుస్తకాలు విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా ముద్రించారు. ఓ వైపు ఇంగ్లిష్తో పాటు మరోవైపు తెలుగులోనూ పాఠ్యాంశాలను ముద్రించారు. టీచర్లంతా ఇంగ్లిష్ మీడియం బోధనకు సంసిద్ధంగా ఉన్నారు.
యూనిఫాం, పుస్తకాలు వచ్చాయా?
జిల్లాలో విద్యార్థులకు సంబంధించి 4లక్షల 9వేల 611 పుస్తకాలు అవసరం. ఇప్పటి వరకు 83,100 పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. మిగతావి కొద్ది రోజుల్లోనే రానున్నాయి. విద్యార్థులకు అందించే యూనిఫాం టెస్కో సంస్థ ద్వారా సరఫరా కానున్నది. ఈ నెలాఖరులోగా జిల్లాకు యూనిఫాం క్లాత్ చేరుకోనున్నది.
బడిబాట కార్యక్రమంతో విద్యార్థుల సంఖ్య పెరిగిందా?
ఈసారి నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్నది. మొత్తం 25వేల మంది విద్యార్థుల నమోదును లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 20వేల మంది విద్యార్థుల నమోదు పూర్తయింది. నమోదులో లక్ష్యాన్ని దాటేస్తాం.
బడిబాటలో ప్రచారం ఎలా సాగింది?
బడిబాటలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తున్న సౌకర్యాలు, టీచర్ల ఉన్నత విద్యార్హతలపై ఇంటింటికీ తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఫ్లెక్సీ బ్యానర్లు, కరపత్రాలు, పోస్టర్లు, సోషల్ మీడియా, కేబుల్ టీవీ ద్వారా టీచర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. స్కూల్ గ్రాంట్ నిధులతో ప్రచార వ్యయాన్ని భరిస్తున్నారు.
డీఎస్సీ ద్వారా జిల్లాలో ఎన్ని పోస్టులు భర్తీ కానున్నాయి?
రాబోయే డీఎస్సీ ద్వారా జిల్లాలో ఖాళీగా ఉన్న 522 ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కానున్నాయి.
మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాలల ప్రగతి ఎలా ఉంది?
జిల్లాలోని ఒక మోడల్ స్కూల్‌తో పాటు 18 కస్తూర్బా పాఠశాలలు స్ఫూర్తిదాయకమైన ప్రగతి సాధిస్తున్నాయి. ఈ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టాల్సి వస్తుండడమే ప్రగతికి నిదర్శనం.
మధ్యాహ్న భోజనం పథకం పరిస్థితేమిటి?
జిల్లాలో మధ్యాహ్న భోజన పథకంపై పకడ్బందీ పర్యవేక్షణ చేస్తున్నాం. విద్యార్థులకు సన్న బియ్యంతో కూడిన పౌష్ఠికాహారం, సురక్షితమైన తాగునీటిని అందిస్తున్నాం. అన్ని పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, డైనింగ్ హాళ్లు ఏర్పాటు చేస్తున్నాం.