ముథోల్, జూన్ 9 : గ్రామాల్లో మౌలిక వసతు ల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం విశేషం గా కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొ న్నారు. మండలంలోని విఠోలి, విఠోలి లాండా, రువ్వి, బ్రహ్మణ్‌గాం, ఆష్టా, గన్నోరా గ్రామాల్లో రూ. కోటి 20 లక్షలతో సీసీ రోడ్డు పనులు, డ్రైనేజీ నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ హయాంలోనే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా పల్లె ప్రగతి, మన ఊరు-మన బడి కార్యక్రమాలతో ఇక పల్లెలు ఆదర్శంగా రూపుది ద్దుకుంటున్నా యని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొ ని అభివృద్ధి చెందాలని సూచించారు. గ్రామాల్లో మరిన్ని సమస్యల పరిష్కారానికి దశల వారీగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను సర్పంచ్‌లు శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అయేషా అఫ్రక్షజ్ ఖాన్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు రాంరెడ్డి, సర్పంచ్ సత్యగౌడ్, సుకన్య రమేశ్‌తోపాటు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.