
బోథ్, ఆగస్టు 15: నియోజకవర్గంలో 75వ స్వాతంత్ర దినోత్సవానిన ఆదివారం ఘనంగా నిర్వహించారు. తహసీల్ కార్యాయలంలో తహసీల్దార్ శివరాజ్, కోర్టులో జడ్జి కిరణ్‌కుమార్, పోలీసు స్టేషన్లో సీఐ నైలు, అటవీ రేంజి కార్యాలయంలో ఎఫ్ఆర్వో సత్యనారాయణ, ఐసీడీఎస్‌లో సీడీపీవో సౌందర్య, బోథ్ సీహెచ్‌సీలో డాక్టర్ ఆర్ రవీంద్రప్రసాద్, సొనాల పీహెచ్సీలో డాక్టర్ నవీన్‌రెడ్డి, బోథ్ సబ్ స్టేషన్లో ఏఈఈ జనార్దన్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్లో డీఈఈ దేవయ్య, మండల పరిషత్‌లో ఎంపీపీ తుల శ్రీనివాస్, బోథ్ జీపీ, గాంధీచౌక్‌లో సర్పంచ్ సురేందర్‌యాదవ్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో విశ్వామిత్ర, మార్కెట్ కమిటీలో చైర్మన్ దావుల భోజన్న, పీఏసీఎస్‌లో చైర్మన్ కే ప్రశాంత్, ఫొటోస్టూడియో సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు బూస లక్ష్మణ్, బస్టాండ్‌లో కంట్రోలర్ సాయన్న మువ్వన్నెల జెండాలు ఆవిష్కరించారు. ఆయా గ్రామాల్లోని పాఠశాలలు, యువజన సంఘాలు, ప్రధాన కూడళ్ల వద్ద జెండాలు ఎగుర వేశారు. కౌఠ (బీ రైతువేదిక వద్ద రైతులు జెండా ఎగుర వేశారు.
సిరికొండ, ఆగస్టు15: తహసీల్ కార్యాలయంలో సర్ఫరాజ్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సురేశ్, ఎంపీపీ అమృత్‌రావు, పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ కృష్ణ కుమార్, ఐకేపీలో సంతోష్‌కుమార్, టీఆర్ఎస్ కార్యాలయంలో మండల, గ్రామాధ్యక్షులు మల్లేశ్, బాలాజీ, కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ అధ్యక్షుడు అమోల్, గ్రామ పంచాయతీల్లో సర్పంచులు జాతీయ జెండాలు ఎగరవేశారు.
సిరికొండ మండలానికి చెందిన ఇద్దరు అధికారులు ఉత్తమ సేవ అవార్డును అందుకున్నారు. సిరికొండ ఎస్ఐ కృష్ణకుమార్, ఆర్ఐ యుజ్వేందర్రెడ్డికి కలెక్టర్ సిక్తాపట్నాయక్ అవార్డులు అందజేశారు.
గుడిహత్నూర్,ఆగస్టు 15: తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ పవన్‌చంద్ర, మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నాగర్గోజే భరత్, పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ ప్రవీణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జాదద్ సునీత, తిరుమల్‌గౌడ్, కుమ్రం శంభు, గిత్తె కల్పన, మీనా, సోయం దస్రు, గోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్ కాలే శివాజీ, ఐకేపీలో ఏపీఎం భగవాండ్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పీఏసీఎస్‌లో జెండాలు ఎగురవేశారు.
భీంపూర్, ఆగస్టు 15: మండల పరిషత్ ఆవరణలో ఎంపీపీ రత్నప్రభ, తహసీల్‌లో తహసీల్దార్ సోము, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ జగదీశ్, పీహెచ్సీలో వైద్యాధికారి విజయసారథి, పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఎంపీడీవో శ్రీనివాస్, డీటీ మమత,జీపీ కార్యదర్శులు, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, రైతుబంధు సమితి గ్రామాధ్యక్షులు ఉత్తం రాథోడ్, ఉల్లాస్, టీఆర్ఎస్ కన్వీనర్ మేకల నాగయ్య, నరేందర్‌యాదవ్, కపిల్, ఆకటి నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు ఉన్నారు.
ఇచ్చోడ ఆగస్టు 15 : ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, బ్యాంక్‌లు, పాఠశాలలు, కళాశాలలు, పార్టీల కార్యాలయాలల్లో జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
బజార్హత్నూర్ ఆగస్టు 15: తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ కూన గంగాధర్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ జయశ్రీ, పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ ప్రవీణ్‌కుమార్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో ప్రమోద్‌రెడ్డి, సహకార సంఘంలో చైర్మన్ మేకల వెంకన్న, సబ్‌స్టేషన్‌లో ఏఈ సందానందం, పశువైద్యాశాలలో పర్వేజ్హైమద్, ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో డాక్టర్ సురేశ్ జాతీయ జెండాను ఎగరవేశారు. పాఠశాలలు, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో హెచ్ఎంలు, సర్పంచ్‌లు జెండా ఎగురవేశారు.
నార్నూర్,ఆగస్టు15: తహసీల్ కార్యాలయాల్లో తహసీల్దార్లు దుర్వా లక్ష్మణ్, అర్కా మోతీరామ్, మండల పరిషత్ కార్యాలయాల్లో కనక మోతుబాయి, చంద్రకళ, ప్రభుత్వ దవాఖానలో విజయ్‌కుమార్, పవన్ కుమార్, సహకార సంఘంలో చైర్మన్ సురేశ్, స్టేట్ బ్యాంక్‌లో సునీల్, ఐకేపీలో ఏపీఎంలు రమేశ్, మాధవి ఎమ్మార్సీలో రాపెల్లి ఆశన్న, ఐసీడీఎస్‌లో సీడీపీవో శారద, పోలీస్‌స్టేషన్ ఎస్ఐలు రమేశ్, వెంకట్, నార్నూర్ గాంధీచౌరస్తా వద్ద సర్పంచ్ బానోత్ గజానంద్‌నాయక్, పంచాయతీల్లో సర్పంచులు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, ఆగస్టు 15: లక్కారం గ్రామపంచాయతీలో రాథోడ్ జనార్దన్, ఘన్‌పూర్‌లో పంద్ర లత, హస్నాపూర్‌లో ఉపేందర్, మత్తడిగూడలో యశోద, శ్యాంపూర్‌లో మల్లిక, నర్సాపూర్(బీ)లో కళావతి, లక్షెటిపేట్లో శ్యాంరావ్, దంతన్పెల్లిలో భూమన్నతో పాటు ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు జాతీయ జెండాను ఎగరవేశారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు అనురాధ, విజయ్ జెండాను ఎగరవేశారు. కార్యదర్శులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.