నిర్మల్ టౌన్, జూన్ 8 : కలెక్టర్ కార్యాలయంలో బుధవారం బెస్ట్ అవెలేబుల్ స్కూల్ కోసం అదనపు కలెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో లక్కీ డీప్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా బెస్ట్ అవెలేబుల్ స్కూల్ కోసం మొత్తం 70 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, 5వ తరగతిలో 13, మొదటి తరగతిలో 13 మందిని ఎంపిక చేసినట్లు అధఙకారులు తెలిపారు. వెయిటింగ్ లిస్టు కింద మరో నలుగురిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారికి ప్రభుత్వం ద్వారా ఉచితంగా చదువు, వసతి కల్పించనున్నట్లు తెలిపారు. డీఎస్డీవో రాజేశ్వర్‌గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.
సంతోషంగా ఉంది..
సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా బెస్ట్ అవెలేబుల్ స్కూల్ కోసం మా పాప శ్వేతకు దరఖాస్తు చేసినం. మొదటిసారి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఒకటో తరగతిలో ప్రైవేటు పాఠశాలలో చేర్పించేందుకు అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– శ్వేత, రాజేశ్వర్(ధన్‌శ్రీ తల్లిదండ్రులు), నిర్మల్
ఇబ్బందులు పోతాయ్..
మాది ఖానాపూర్ మండలంలోని తర్లపాడ్. మా పాప నవీనను ప్రైవేటులో చదివించాలనుకున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఉండే. అందుకే బెస్ట్ అవెలేబుల్ స్కూల్ కోసం 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసిన. లక్కీడీప్ ద్వారా మా పాప ఎంపికైంది. మా ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వం పేద విద్యార్థులకు ఈ విధానం అమలు చేయడం చాలా సంతోషంగా ఉంది.
– ఎస్ గంగాధర్(నవీన తండ్రి) తర్లపాడ్