ఖానాపూర్ టౌన్, జూన్ 8: ఖానాపూర్ మున్సిపాలిటీని పట్టణ ప్రగతి కార్యక్రమంలో సుందరంగా తీర్చిదిద్దాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి పట్టణంలో పర్యటించారు. పలు వార్డులను సందర్శించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలపై ఆరాతీశారు. పరిశుభ్రత పనులు బాగున్నాయని, చైర్మన్‌తో పాటు పాలకవర్గ సభ్యులు కూడా మరింతగా కృషిచేయాలన్నారు. కాగా.. ఆరో వార్డుకు చెందిన కొందరు తాగునీరు సక్రమంగా అందడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్, మున్సిపల్ కమిషనర్ సంతోష్, తహసీల్దార్ రాజమోహన్, ఆయా వార్డుల ప్రత్యేకాధికారులు, పలు శాఖ అధికారులు, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజలు భాగస్వాములు కావాలి
ఖానాపూర్ రూరల్, జూన్ 8 : పల్లెప్రగతిలో ప్రజలందరూ భాగస్వాములైతే గ్రామాలన్నీ అభివృద్ధి చెం దుతాయని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. మండలంలోని రాజురా, బావాపూర్(ఆర్), బావాపూర్ తండా, సత్తనపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే అజ్మీ రా రేఖానాయక్, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి పర్యటించారు. బావాపూర్ తండా పంచాయతీ పరిధి పంగెడుగూడెంలోని గిరిజనులను కలిశారు. గూ డెంకు వెళ్లడానికి రోడ్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. బావాపూర్(ఆర్) గ్రామానికి చెందిన మూగ బాలుడు పొలాస సత్యనారాయణ(13)కు పింఛన్ ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. రాజురా, సత్తనపల్లిలో హరితహారంలో మొక్కలు నాటారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, ఎంపీపీ మోహిద్, డీఆర్డీవో విజయలక్ష్మి, ఎంపీడీవో వనజ, తహాసీల్దార్ రాజ మోహన్, ఎంపీవో చంద్రశేఖర్, సర్పంచులు చిన్నం లావణ్య రవి, ఎరకేరి మల్లేశ్, వినేశ్, సీర్ల లక్ష్మి, ఎలకొండ రామకృష్ణ, నాయకులు షాకీర్, గుమ్ముల లింగన్న, పులివేని సత్యనారాయణ, ప్రత్యేకాధికారి మదన్ మోహన్ గౌడ్, కార్యదర్శులు అనిల్, ఇర్ఫాన్, మధు పాల్గొన్నారు.
పారిశుధ్య పనులు నిరంతరం చేపట్టాలి
పెంబి, మే 8 : పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, కలెక్టర్ ము షారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. మండలంలోని మందపల్లి గ్రామంలో పర్యటించారు. పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి ఆటలు ఆడారు. సెగ్రిగేషన్ షెడ్డులో వర్మీ కంపోస్ట్ తయారీని పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఆర్టీవో విజయలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, వైస్ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, తహసీల్దార్ అడ్ప శ్రీధర్, ఎంపీడీవో లింబాద్రి, ఎంపీవో రత్నాకర్ రావు, సర్పంచ్ చెర్పురి సుధాకర్, అధికారులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
గిరిజన గ్రామాల్లో సౌకర్యాల కల్పనకు కృషి
కడెం, జూన్ 8: గిరిజన గ్రామాలకు తగిన సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. మండలంలోని మారుమూల అటవీ గ్రామమైన ఇస్లాంపూర్‌ను అయా శాఖల అధికారులతో కలిసి సందర్శించా రు. ఉడుంపూర్ నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు దట్టమైన అటవీ ప్రాంతం, రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అటవీశాఖ జీపు, కాసేపు కాలినడకన ఇస్లాంపూర్‌కు చేరుకున్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేక బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. త్రీఫేజ్ వి ద్యుత్ సరఫరా లేదని, రేషన్ కోసం అటవీ ప్రాంతం నుంచి ఉడుంపూర్ గ్రామానికే వెళ్లాల్సి ఉంటుందని, వర్షాకాలం రోడ్డు సౌకర్యం లేక పాఠశాల కూడా తెరవ డం కష్టంగా ఉంటుందని తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్, ఎమ్మె ల్యే జీసీసీ ద్వారా ఇస్లాంపూర్ గ్రామంలోనే నూతన రేష న్ దుకాణాన్ని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అటవీశాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో రోడ్డు నిర్మాణంలో జాప్యమవుతున్నట్లు చెప్పారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? అని ప్రజలను అడగడంతో అందుతున్నాయని చెప్పారు. సర్పంచులు కొండాపురం అనూష, కనక పద్మ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఆర్డీవో విజయలక్ష్మి, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, డీఈ చందు, ఏఈ లవకుమార్, డీటీడీవో శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ గజానన్, ఎంపీవో వెంకటేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, ఎంపీపీ అలెగ్జాండర్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గోళ్ల వేణుగోపాల్, ఆత్మ చైర్మన్ కానూరి సతీశ్, ఆయా శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.