నార్నూర్, జూన్ 8 : పల్లె ప్రగతితో గ్రామాల్లో సమస్యలు పరిష్కరించుకోవచ్చని గాదిగూడ ఎంపీవో ఎస్కే ఖలీమ్హైమద్ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గాదిగూడ మండలం సావ్రి గ్రామంలో చేపడుతున్న పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, మిషన్ ఇంద్రధనష్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే గర్భిణులు, పిల్లలు, బాలింతలకు పౌష్టికాహారం అందజేయాలన్నారు. ఆయన వెంట సర్పంచ్ మోతుబాయి, పంచాయతీ కార్యదర్శి సునీల్‌కుమార్, రవీందర్, సిబ్బంది ఉన్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమంపై అవగాహన
నార్నూర్, జూన్ 8 : గాదిగూడ మండలం సావ్రి, పిప్రి గ్రామాల్లో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత బృందం సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంపై ప్రదర్శన ద్వారా వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి టీం లీడర్ ఆత్రం గోవింద్‌రావ్, సర్పంచ్ కొడప మోతుబాయి, మాజీ సర్పంచ్ జాకు, పంచాయతీ కార్యదర్శి సునీల్‌కుమార్, బృందం సభ్యులు రమేశ్, మోహన్‌నాయక్, వెంకట్రావ్, శంకర్, రాజులింగు, నరేశ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు చేయించుకోవాలి
బోథ్, జూన్ 8: ప్రభుత్వ దవాఖాన, పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయించుకోవాలని సొనాల సర్పంచ్ సదానందం గర్భిణులకు సూచించారు. పల్లెప్రగతిలో భాగంగా బుధవారం మండలంలోని సొనాల గ్రామంలో వైద్యసిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి గర్భిణులకు అవగాహన కల్పించారు. మిషన్ ఇంద్రధనష్లో పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవిస్తే కేసీఆర్ కిట్ అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వామి, ఏఎన్ఎం పరిపూర్ణ, ఆశకార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్, జూన్ 8 : పల్లె ప్రగతిలో భాగంగా గాదిగూడ మండలం రాంపూర్ గ్రామంలో మిషన్ ఇంద్రధనష్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆత్రం మహేశ్వరీవామన్ మాట్లాడుతూ పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది, ఆశకార్యకర్తలు సంగీత, గోవింద్‌రావ్, దత్త, గర్భిణులు పాల్గొన్నారు.
క్రీడాప్రాంగణానికి స్థలం పరిశీలన
జైనథ్, జూన్ 8 : పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని లేకర్వాడలో క్రీడాప్రాంగణానికి స్థలాన్ని ఎంపీడీవో గజానన్‌రావు పరిశీలించారు. అలాగే పార్డి(కే)లో క్రీడాప్రాంగణానికి స్థలాన్ని తహసీల్దార్ రాఘవేంద్రరావు పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీవో వెంకటరమణ, మండల ప్రత్యేకాధికారి పుల్లయ్య, ఏపీవో మేఘమాల, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.