
నిర్మల్ అర్బన్, ఆగస్టు 15 : ప్రభుత్వ దవాఖానాలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా దవాఖానలో రోగుల సౌకర్యార్థం రూ.1.50 కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కొవిడ్ మహమ్మారిని అడ్డుకట్ట వేసేందుకు వైద్యులు ఎంతో కష్ట పడ్డారని కొనియాడారు. కొవిడ్ టెస్టులు ఆర్టీపీసీఆర్ కోసం గతంలో హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, వాటి రిపోర్టులు వచ్చే సరికి రెండు రోజుల సమయం పట్టేదన్నారు.
ఈ విషయమై ముఖ్యమంత్రితో చర్చించి జిల్లాకు ఆర్టీపీసీఆర్ ల్యాబ్ మంజూరు చేయాలని కోరగా రూ.1.50 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. నిర్మల్‌లో ల్యాబ్‌ను ప్రారంబించుకోవడం జరిగిందని తెలిపారు.దీంతో ప్రతీ రోజు 200 మందికి ఇక్కడే టెస్టులు నిర్వహించుకోవచ్చని అన్నారు. ఆక్సిజన్ ప్లాంట్‌ను త్వరలోనే ప్రారంభించుకోనున్నామన్నారు. జిల్లాకు రెండో దశలో మెడికల్ కళాశాల మంజూరుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ముఫారఫ్ అలీ ఫారుఖీ, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మీ, డీఎంహెచ్‌వో ధన్‌రాజ్, సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేంధర్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, డీసీసీబీ మాజీచైర్మన్ రాంకిషన్ రెడ్డి, ప్రముఖ వ్యాపా ర వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు.
నిత్యావసర సరుకుల పంపిణీ
ఇటీవల వరదల కారణంగా నష్టపోయిన జీఎన్ఆర్, ఆస్రాకాలనీ, గాంధీనగర్, బుడగజంగం కాలనీ ప్రజలకు లయన్స్ కల్బ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు,దుప్పట్లను మంత్రి అల్లోల పంపిణీ చేశారు. వరద బాధితులందరిని ఆదుకునేందుకు సంబంధిత శాఖల ఆధ్వర్యంలో పరిహార అంచనాను వేయించినట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరికి పరిహారం అందిస్తామన్నారు.