
ఉట్నూర్, ఆగస్టు15 : పట్టణంతో పాటు మండలంలో 75వ స్వాతంత్య్ర దినోత్స వా న్ని వేడుకలను ప్రజలు, అధికారులు, రాజకీ య నాయకులు ఆదివారం ఘనంగా జరుపు కున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాల యాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జెండా వంద నం చేశారు. అనంతరం స్వీట్లు పంపి ణీ చేశారు. టీఆర్ఎస్, ఇతర పార్టీ కార్యాల యాల్లో జెండాను ఎగురవేశారు.
ఐటీడీఏలో…
ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలో పీవో భవేశ్‌మిశ్రా మహనీయులైన అంబేద్కర్, గాంధీ చిత్రపటాలకు పూల మాల ల వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గిరిజనుల అభివృద్ధ్దికి ఐటీడీఏ ఆధ్వ ర్యంలో అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నా రు. గిరిజనులకు మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నా మన్నారు. గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఐటీడీఏ పరిధిలో 134 ఆశ్ర మ పాఠశాలలు, 27 గురుకుల విద్యా సం స్థల ద్వారా 45477 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. మారు మూల ప్రాంతాల్లో అవ్వాల్ అంబులెన్స్‌లు ఏర్పాటు చేసి మెరు గైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. 13.75 కోట్ల సబ్సి డీతో కూడిన 19.81 కోట్ల విలువ గల 1274 యూనిట్లు మం జూరు చేశామని పేర్కొన్నారు. త్వరలోనే లబ్ధ్దిదారులకు అంది స్తామని పేర్కొన్నారు. జడ్పీటీసీ చారులత, ఏపీవో భీంరావు, డీడీ సంధ్యారాణి, జీసీసీ డీఎం సదానందం, మేనేజర్ రాంబా బు, బీఈడీ ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, ఇంజినీరింగ్ ఈఈ భీంరావు, సీడీపీవో శ్రావణి, వివిధ శాఖల అధికారులు, నాయ కులు పాల్గొన్నారు.