
నిర్మల్ చైన్‌గేట్, ఆగస్టు 15: పలు కారణాలతో పలువురు మృతి చెందగా, బాధిత కుటుంబసభ్యులకు తెలంగాణ డయా గ్నస్టిక్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయమందించారు. టెక్నీషియన్లు దశరథ్, వేణుగోపాల్, సుబ్రహ్మణ్యం కుటుంబాలకు రూ. 2 లక్షల 40 వేలు ఎల్ఐసీ ఫిక్స్ డిపాజిట్ పత్రాలు సభ్యులు అందజేశారు. బాధిత కుటుంబాలకు అనారోగ్య సమస్యలెదురైనా ఉచితంగా సేవలందిస్తామన్నారు. డీఎంహెచ్‌వో ధన్‌రాజ్, డీసీహెచ్ఎస్ దేవేందర్‌రెడ్డి, టీడీఏ జిల్లా అధ్యక్షుడు సంతోష్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి నేరేళ్ల హనుమంతు, ఐంఎంఏ అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి సంతోష్ వైద్యులు దామెర రాములు, మురళీధర్, కృష్ణంరాజు, స్వర్ణారెడ్డి, మాధవి, ప్రకాశ్, వెంకట్రావు, విశ్వనా థ్, వకీల్, అనిల్, వెంకట్, శ్రీనివాస్, సందీప్, సంపత్, రవి, ప్రకాశ్, తదితరులు ఉన్నారు.
జామ్‌లో..
సారంగాపూర్, ఆగస్టు 15 : జామ్ గ్రామానికి చెందిన ఎల్లు ల్ల రాములు ఆయన భార్య నర్సవ్వలు మే నెలలో కరోనా సోకి మృత్యువాత పడ్డారు. వారి కూతుళ్లు ఎల్లుల్ల సమిత, శ్రీలత అనాథనలు కావడంతో ఉన్నత పాఠశాల ఉపాధ్యా యులు రూ. 11,500 నగదును అందజేశారు. అలాగే జామ్ గ్రామానికి చెందిన శేనిగారపు నవదీప్ డెంగీతో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. జామ్ చిన్నూర్ ము న్నూరుకాపు సంఘం సభ్యులు రూ. 5వేల నగదును బాలుడి తల్లి లక్ష్మికి అందజేశా రు. హెచ్ఎం సంధ్యారాణి, ఎస్ఎంసీ చైర్మన్ నరేశ్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు గడ్డల రాజు, కోర్వరాము, గడ్డల భూమేశ్, బారే పోశెట్టి, తుల మహేందర్, గడ్డల నరేశ్, బాశెట్టి ప్రవీన్, రవి, అశోక్, బుచ్చన్న పాల్గొన్నారు.