భైంసా, మే 25 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొ న్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నిధు ల నుంచి గాంధీ గంజ్‌లో ఏడు దుకాణ సముదా యాల నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారు పల్లె, పట్టణాల ప్రగతికి అత్య ధిక నిధులు కేటాయిస్తున్నదని పేర్కొన్నారు. అన్నిప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు. రూ. 42 లక్షలతో ఏడు దుకాణ సముదాయాలు నిర్మించనున్నారని తెలి పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీ కృష్ణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బామ్ని రాజన్న, రమేశ్ మాశెట్టి వార్, ప్రసన్నజిత్ అగ్రే, భోజన్న, తాలుకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు రోళ్ల రమేశ్, వ్యవసాయ శాఖ ఏడీఎం అశ్వక్ హైమద్, కార్యదర్శి అడెల్లు ఉన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత
కుభీర్, మే 25 : కుభీర్‌లోని ఐకేపీ కార్యాల య సమావేశ మందిరంలో బుధవారం ఆయా గ్రామాలకు చెందిన 139 మంది లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సుమారు రూ.కోటీ 36 లక్షల విలువైన చెక్కులను ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆడబిడ్డ పెండ్లికి మేన మామ లాగా రూ. లక్షా 116లు అందిస్తున్న సీఎం కేసీఆర్ సార్ చరిత్ర పుటల్లో నిలిచిపోతా రని, ప్రజల ఆశీస్సులే ఆయనకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. ఇలాంటి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవని తెలంగాణ రోల్ మోడల్ అని పేర్కొన్నారు. తహసీల్దార్ విశ్వంభర్, జడ్పీటీసీ అల్కాతాయి, ఏఎంసీ చైర్మన్ కందుర్ సంతోష్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, సింగిల్ విండో చైర్మన్ రేకుల గంగాచరణ్, నాయకులు బొప్ప నాగలింగం, సంజయ్ చౌహాన్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.