
బోథ్, ఆగస్టు 15: తహసీల్ కార్యాలయంలో ఆదివారం మండల గణాంకదర్శినిని ఆవిష్కరించారు. మండలానికి సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన వివరాలు గణాంకశాఖ అధికారి సురేశ్ పుస్తకంగా రూపొందించారు. తహసీల్దార్ శివరాజ్, ఎంపీడీవో సీహెచ్ రాధ, డిప్యూటీ తహసీల్దార్ రాథోడ్ ప్రకాశ్, గణాంకశాఖ అధికారి సురేశ్, సర్పంచ్ సురేందర్‌యాదవ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కే ప్రశాంత్, ఆత్మ చైర్మన్ ఎం సుభాష్, చాట్ల ఉమేశ్, మహమూద్, వెంకటేశ్, ఆర్ఐలు శ్యాంసుందర్‌రెడ్డి, సునీత, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.