కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్ర భుత్వం వ్యవసాయ రంగంలో అమలు చేస్తు న్న సంక్షేమ పథకాల ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో గతేడాది కంటే ఈ వానకాలం సీజన్లో పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో నకిలీ విత్తనాల రవాణా, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం ఆదేశించడంతో పోలీస్, రెవె న్యూ, వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో విత్తనాల దళారుల బెడద ఎక్కువగా ఉంటుం ది. అమాయక రైతులకు నాసిరకం విత్తనాల ను అంటగట్టి, అందినకాడికి దండుకునే అవకాశం ఉంటుంది. వివిధ రకాల కంపెనీల పేర్ల తో నకిలీ విత్తనాలు అమాయక రైతులకు అం టగడుతున్న ముఠాలను అరికట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు.
టాస్క్ఫోర్స్ తనిఖీలు..
వానకాలం సీజన్లో పత్తి ఎక్కువగా వేసే అవకాశం ఉంటుంది. పత్తిసాగులో భాగంగా వివి ధ కంపెనీలకు చెందిన బీటీ-2 రకం విత్తనాలను వినియోగిస్తున్నారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. కాగా కొందరు దళారులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ర్టాల నుంచి నకిలీ విత్తనాలు తెప్పించి, రైతులకు అంటగడుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఉన్నతాధికారులు జిల్లా, మండల స్థాయిలో టాస్క్ఫోర్స్ టీం లను ఏర్పాటు చేశారు. పోలీసు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు ఈ బృందంలో ఉంటారు. జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ టీంలో డీ ఎస్పీ, వ్యవసాయ శాఖ ఏడీ, మండల స్థాయి టీంలలో ఎస్ఐ, మండల వ్యవసాయశాఖ అ ధికారి, తహసీల్దార్ ఉంటారు. వీరు తమ పరిధిలోని విత్తనాల దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతేడాది కూడా టా స్క్ఫోర్స్ బృందాల తనిఖీల కారణంగా నకిలీ బెడద నుంచి జిల్లా రైతులకు ఉపశమనం లభించింది. ఫలితంగా పంటల సాగులో రైతులకు ఎలాంటి సమస్యలు రాలేదు. ప్రస్తుతం కూడా తనిఖీలు కొనసాగుతుండడంతో, అక్రమార్కుల్లో దడ మొదలైంది.
దుకాణాల్లో విస్తృత సోదాలు..
ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో నకిలీ విత్తనాలను అడ్డుకునేందుకు టాస్క్ఫోర్స్ టీం స భ్యులు విస్తృతం తనిఖీ చేస్తున్నారు. డీలర్ల దుకాణాల్లో విత్తనాలను కొనుగోలు చేసే సమయంలో ఇచ్చే రసీదులను పరిశీలించటడంతోపాటు రసీదు ఏ రైతు పేరున ఉందో ఆరైతు వద్దకు వెళ్లి విచారణ చేపడుతున్నారు. ఈ రసీదులపై రైతుల చిరునామా, విత్తనాలు విక్రయించిన తేదీ, కంపెనీ పేరు, పరిమాణం, కొ నుగోలు చేసిన రైతుల సంతకం, అమ్మిన డీలర్ సంతకం, విత్తనాల సంచులపై ఉన్న లా ట్ నెంబర్లు నమోదు చేయాల్సి ఉంటుంది. వీ టి ఆధారంగా ప్రతి విషయాన్ని టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీచేస్తాయి. సాధారణంగా బ్రాండెడ్ కంపెనీలు విక్రయించే విత్తనాలు, మందులపై వాటి తయారీ, ఎక్స్పైరీ తేదీలు, లాట్నెంబర్లు, కంపెనీ, వాటి పరిమాణం, తదితర వివరాలు ఉంటాయి. బ్రాండెడ్ కంపెనీలు తయారు చేసినట్లుగా నకిలీ విత్తనాల కం పెనీలు కూడా అదేస్థాయిలో విత్తనాల ప్యాకెట్లను ముద్రించి మార్కెట్లోనికి సరఫరా చేస్తా యి. కాని వీటిపై విత్తనాలు తయారు చేసిన తే దీ, ఎక్స్పైరీ తేదీ, లాట్ నెంబర్, వంటి వివరా లు ఉండవు. ఏదో ఒక పేరుతో ప్యాకెట్లను తయారు చేసి సరఫరా చేస్తుంటాయి.
రైతులు రసీదులు తీసుకోవాలి
జిల్లాలో నకిలీ విత్తనాలు నివారించడానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో టాస్క్ఫోర్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఏఈవోలు, రైతుబంధు కమిటీల సభ్యులు సైతం నకిలీ విత్తనాల విక్రయాలు జరగుకుండా చూస్తున్నారు. రైతు లు లైసెన్స్ ఉన్న దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. పంట విక్రయాలు జరిగేంత వర కు వాటిని భద్రపర్చుకోవాలి. బ్యాగుల సీ ల్, కంపెనీ ముద్ర, ప్యాకింగ్ తేదీ, ఎక్స్పైరీ తేదీ, ఎమ్మార్పీ ధరలు చూడాలి. విత్తనాల కారణంగా పంట దిగుబడులు రాకపోతే కంపెనీల నుంచి పరిహారం ఇప్పించే అవకాశాలున్నాయి. తెల్లసంచుల్లో అమ్మే విత్తనాలు కొనవద్దు.
-పుల్లయ్య, జిల్లా వ్యవసాయ అధికారి,ఆదిలాబాద్