చెన్నూర్, మే 24: చెన్నూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్ పట్టణంలో రూ.1 కోటి వ్యయంతో నిర్మించే వైకుంఠధామం నిర్మా ణ పనులకు రూ. 50లక్షల వ్యయంతో పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద చిరు వ్యాపారులకు నిర్మించే వర్తక సముదాయం పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే సుమారు రూ.100కోట్ల పైచిలుకు వ్యయంతో చెన్నూర్ పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పట్టణంలోని జలాల్ పెట్రోల్ బంక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, ప్రధాన రహదారి విస్తరణ పనులు, డివైడర్, సైడ్ డ్రైన్ నిర్మాణం పనులు పూర్తి కావస్తున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ దవాఖాన నూతన భవన నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు.
అంబేద్కర్ స్టడీ సెంటర్, ఇంటిగ్రేటేడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, కేసీఆర్ పార్కు నిర్మాణం, పెద్ద చెరువు, కుమ్మరి కుంట మినీ ట్యాంకు బండ్ నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. పట్టణంలో అంతర్గత రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి రాష్ట్ర సభ్యుడు, కోటపల్లి వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కౌన్సిలర్లు వేల్పుల సుధాకర్, జాడి సురేఖ, రేవెల్లి మహేశ్, దోమకొండ అనిల్, పోగుల సతీశ్, జోడు శంకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లెల దామోదర్‌రెడ్డి, నాయకుల రాంలాల్ గిల్డా, జాడి తిరుపతి, మేడ సురేశ్‌రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
శంకుస్థాపనల అనంతరం చెన్నూర్ పట్టణంలోని పలు కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పాల్గొన్నారు. పట్టణంలో కేసీఆర్ పార్కు నిర్మాణం పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అనారోగ్యంతో బాధ పడుతున్న టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ముజీబ్‌ను పరామర్శించారు. పట్టణంలోని కొత్తగూడెం కాలనీలో వెల్లంపల్లి మొగిళి కుమారుడు కుమారుడు ఇటీవల మృతి చెందగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
త్వరలో భీమారంలో సెంట్రల్ లైటింగ్
భీమారం, మే 24 త్వరలో భీమారంలో సెంట్రల్ లైటింగ్ త్వరలో ప్రారంభం కానుందని, భీమారం దశాబ్దాల కల నెరవేరనుందని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. భీమారంలోని సెంట్రల్ లైటింగ్‌తో పాటు నాలుగు వరుసల రోడ్డును మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో భీమారం ఒక సిటీ మాదిరిగా మారనుందని చెప్పారు. అనంతరం భీమారం నర్సరీలో ఆయిల్ పాం మొక్కలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయిల్ పాం నర్సరీ ప్రతినిధి ఉదయ్ కుమార్ , టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలగూర రాజ్‌కుమార్, మాజీ జడ్పీటీసీ జర్పుల రాజ్‌కుమార్ సర్పంచ్‌లు , నాయకులు తదితరులున్నారు.
బాధిత కుటుంబాలకు విప్ పరామార్శ
బాధిత కుటుంబాలను ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే మంగళవారం పరామర్శించారు. భీమారం మండలంలో దాంపూర్ లో దాంపూర్ సర్పంచ్ సంతోషం భాస్కర్ రెడ్డి అమ్మ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని , బూరుగుపల్లిలో గత కొన్ని రోజుల క్రితం జైపూర్ శివారు ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన భూక్యా చిరంజీవి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దరావత్ రవి చిత్రపటాలకు నివాళులర్పించారు. అదే గ్రామంలో గాయపడిన టీఆర్ఎస్వై మండల అధ్యక్షుడు రాజేశ్ నాయక్ , సోషల్ మీడియా ఇన్చార్జి రవి నాయక్‌ను పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ భూక్యా తిరుమల నాయక్ , బూరుగుపల్లి సర్పంచ్ వడ్ల కొండ రమాదేవి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజ కుమార్ , రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ పర్తి రెడ్డి మహేశ్వర్ రెడ్డి , సర్పంచ్‌లు గద్దెరాంరెడ్డి , దుర్గం మల్లేశ్, చెన్నూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్యా రాజ్ కుమార్ నాయక్ , పార్టీ సీనియర్ నాయకులు దాసరి మధునయ్య, నాయకులు ఆత్కూరి రాము, పోడెటి రవి , కట్ట నాగరాజు , భూక్యా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.