లక్షెట్టిపేట రూరల్, మే 24 : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం వరంలా మారిందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన లక్షెట్టిపేటలో పట్టణంలోని విశ్రాంతి భవన ఆవరణలో 76 మంది లబ్ధిదారులకు స్థానిక నాయకులతో కలిసి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమం కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నడుం బిగించిందని తెలిపారు. ఒక్కో విద్యార్థిపై 80 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని చెప్పారు.
83 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటన విడుదల చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. పేకాట, గంజాయి లాంటి వ్యసనాలకు యువత గురి కాకుండా ఉండేందుకే రాష్ట్ర వ్యాప్తంగా క్లబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం మూసేసిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు పారదర్శక పాలన, జవాబుదారీ తనం అవసరమని, కాని కొంతమంది అహంకారం, గుండాయిజం ప్రదర్శిస్తున్నారని, హద్దు మీరి ప్రవర్తించవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు అంకతి రమేశ్, మండల యూత్ అధ్యక్షుడు అంకతి గంగాధర్, కౌన్సిలర్లు, రాజన్న, సురేశ్ నాయక్, రాందేని వెంకటేశ్, కో ఆప్షన్ సభ్యులు షాహిద్ అలీ, సర్పంచ్‌లు సొల్లు సురేశ్, బానోత్ జయంత్, గోళ్ల రవీందర్, రాగుల రాజేశం, పింగళి శ్రీలత, సీనియర్ నాయకుల జగన్మోహన్ రెడ్డి, దొంత నర్సయ్య, మోటపలుకుల శ్రీనివాస్, చెరుకు తిరుపతి, లబ్ధిదారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గ్రామ స్వరాజ్యమే ప్రభుత్వ లక్ష్యం
గ్రామ స్వరాజ్యమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి స్థానిక సర్పంచ్, నాయకులతో కలిసి నూతన గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు. భవన నిర్మాణానికి స్థల దాత, సర్పంచ్ మట్టపల్లి మంజుల- సత్యనారాయణను ఎమ్మెల్యేతో పాటు మండల నాయకులు అభినందించారు. నియోజక వర్గంలో మొట్టమొదటి సారిగా రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ నుంచి రూ.20 లక్షలు మం జూరైట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందపెల్లి స్వర్ణలత-శ్రీనివాస్, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి-రవి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు నయీం పాషా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గోళ్ల శ్రీనివాస్, సర్పంచ్‌లు కొట్టె మహేందర్, ఆనె మల్లేశ్, ఉప సర్పంచ్ చంద్రమౌళి, వార్డు సభ్యులు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సీపెల్లి మొగిళి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు మొగిళి రాజయ్య, మండల యువత ఉపాధ్యక్షుడు అలిశెట్టి కోటి, నాయకులు మల్రాజు సునీల్ రావు, చిన్న సత్యగౌడ్, కొట్టే తిరుపతి, నల్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.