ఇచ్చోడ, మే 24 : గ్రామీణ యువత కోసమే క్రీడామైదానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీపీ నిమ్మల ప్రీతమ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని దుబార్‌పేట గ్రామంలో క్రీడామైదానానికి స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో అనువైన స్థలాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. మైదానాలకు స్థలం కేటాయింపు తర్వాత వాటి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేయనున్నదని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చాహకటి అభిమాన్, ఎంపీవో కొమ్ము రమేశ్, ఈజీఎస్ ఏపీవో నరేందర్ గౌడ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని కుమారి గ్రామంలో క్రీడామైదానం ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఎంపీడీవో అబ్దుల్ సమద్, సర్పంచ్ రాజుయాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ క్రీడామైదానాల ద్వారా గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయగలుగుతామని తెలిపారు. జూన్ 2వ తేదీన రెండు గ్రామాల్లో క్రీడా మైదానాలు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ నాగోరావ్, సర్వేయర్ శంకర్, ఈజీఎస్ ఏపీవో వసంత్‌రావ్, పంచాయతీ కార్యదర్శి దయాకర్, వీఆర్ఏ రాజారాం, నాయకులు చంద్రశేఖర్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి గ్రామంలో క్రీడా మైదానం
ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని డీఎల్పీవో ధర్మరాణి అన్నారు. ఇచ్చోడ గ్రామ పంచాయతీ పరిధిలోని తండా సమీపంలో మంగళవారం క్రీడామైదానానికి స్థలాన్ని ఎంపిక చేసి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ చౌహాన్ సునీత, ఎంపీవో రమేశ్, ఏపీవో నరేందర్ గౌడ్, ఈవో సూర్య ప్రకాశ్, బిల్ కలెక్టర్ రాజేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.