కోటపల్లి, మే 11 : కోటపల్లి మండలంలోని మారుమూల గ్రామాల రహదారి కష్టాలకు చెక్ పడనుంది. మండలంలో 5 రోడ్లు, 9 బ్రిడ్జిల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఆయా చోట్ల త్వరలోనే పనులు ప్రారంభం కానుండగా, వీటి నిర్మాణం పూర్తయితే గ్రామాల మధ్య దూరం తగ్గడంతో పాటు ప్రజా రవాణా మరింత సులభం కానుంది. దీంతో మండల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
మండలంలోని మారుమూల గ్రామాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎదురవుతున్న ఇబ్బందులు తీరనునున్నాయి. సరైన రోడ్డు లేకపోవడంతో వాగుల పై బ్రిడ్జిలు లేక అవస్థలు పడుతున్న జనాల కష్టాలకు చెక్ పడనుంది. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ కృషితో కోటపల్లి మండలంలో 5 రోడ్లు, 9 బ్రిడ్జిల నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల పూర్తయితే కోటపల్లి మండల ప్రజల రవాణా కష్టాలు పూర్తిగా తీరిపోనున్నాయి. రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణంతో గ్రామా ల గ్రామాల మధ్య దూరం తగ్గడంతో పాటు ప్రజా రవాణా మరింత సులభం కానుంది.
చె న్నూర్ నియోజకవర్గంలోనే మారుమూల మండలమైన కోటపల్లి మండల ప్రజల రవాణా కష్టాల పై ప్రత్యేకంగా దృష్టి సారించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఇప్పటికే పెండింగ్లో ఉన్న తుంతుంగా వాగు పై బ్రిడ్జి నిర్మాణం, అసంపూర్తి గా ఉన్న రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. తుంతుంగా వాగు పై బ్రిడ్జి పనులు చకచకా సాగుతుండగా, ఈ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టిన బాల్క సుమన్ వర్షాకాలం నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయించి బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. మండలంలో పెండింగ్లో ఉన్న 5 రోడ్లు, 9 బ్రిడ్జిల నిర్మాణంతో ప్రజలకు మరింత సౌకర్యం ఏర్పడనుంది. మొత్తంగా 5 కొత్త రోడ్ల నిర్మాణానికి గాను రూ.13.92 కోట్లు, 9 బ్రిడ్జిల నిర్మాణానికి గాను 25.94 కోట్లు మంజూరయ్యాయి. దీంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంజూరైన నిధుల వివరాలు
బ్రిడ్జిల వివరాలు
తీరనున్న ప్రజల కష్టాలు
కోటపల్లి మండలంలోని 5 రోడ్లు, 9 బ్రిడ్జిల నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు కాగా వీటితో ప్రజల కష్టాలు తీరనున్నాయి. చెన్నూర్ నియోజకవర్గంలో వెనుకబడిపోయిన కోటపల్లి మండల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతున్నాం. చెన్నూర్ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతూ నిధులను మంజూరు చేయిస్తున్నాం. ఇప్పటికే తుంతుంగా వాగు బ్రిడ్జి నిర్మాణంతో పాటు అసంపూర్తి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాం. ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిన ఈ రూ. 40 కోట్లతో దాదాపుగా రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణంతో పనులు పూర్తి కానున్నాయి. రానున్న రోజులలో మండలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం.
– బాల్క సుమన్, ప్రభుత్వ విప్