మందమర్రి రూరల్, మే 11 : నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డైరెక్టర్ (పా) బలరాం సూచించారు. బుధవారం మందమర్రి ఏరియాను సందర్శించారు. అనంతరం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జీఎం చింతల శ్రీనివాస్, అన్ని గనులు, డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు, ఏజెంట్లతో ఉత్పత్తి, ఉత్పాదకతపై సమావేశం నిర్వహించారు. దేశంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు. అందుకే ఉత్పత్తి, రవాణాపై శ్రద్ధచూపాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్వోటూ జీఎం గోపాల్ సింగ్, ఏజీఎం, శాంతిఖని ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఏజీఎం ఫైనాన్స్ చక్రవర్తి, ఏజీఎం (ఈఅండ్ఎం) రామ్మూర్తి, ఏజీఎం, కేకే గ్రూప్ ఏజెంట్ రాంచందర్, ఐఈడీ, డీజీఎం రాజన్న, పర్సనల్ మేనేజర్ వరప్రసాద్, ఏరియా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ ఓసీపీ సందర్శన..
శ్రీరాంపూర్, మే 11 : శ్రీరాంపూర్ ఓసీపీని డైరెక్టర్ (పా) ఎన్ బలరాం సందర్శించారు. ఎస్వోటూ జీఎం కే హరినారాయణతో కలిసి ఓసీపీ క్వారీని వ్యూపాయింట్ నుంచి పరిశీలించారు. అక్కడి నుంచి ఓసీపీ క్వారీలోని బొగ్గు ఉత్పత్తి పని స్థలాలు, బొగ్గు నిల్వలను ప్రాజెక్టు ఆఫీసర్ పురుషోత్తం రెడ్డి నమూనా మ్యాప్ ద్వారా వివరించారు. అనంతరం కార్యాలయంలో ఓసీపీ ఉత్ప త్తి, ఉత్పాదకతపై అధికారులతో సమీక్షించారు. దేశంలోని పరిశ్రమల్లో బొగ్గు కొరత ఉన్నదని, వేసవి దృష్ట్యా విద్యుత్ వినియోగం అధికంగా ఉండడం వల్ల బొగ్గు అవసరం చాలా ముఖ్యంగా మారిందన్నారు. ఈ సమావేశంలో ఏరియా సర్వే ఆఫీసర్ రాఘవేంద్రరావు, ఓసీపీ మేనేజర్ జనార్దన్, సేఫ్టీ ఆఫీసర్ రమేశ్, ఈఈ చంద్రశేఖర్, ఓసీపీ సర్వే ఆఫీసర్ సంపత్ పాల్గొన్నారు.
బెల్లంపల్లి ఏరియాలో..
రెబ్బెన, మే 11 : బెల్లంపల్లి ఏరియాలో డైరక్టర్ బలరాం, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కోల్ మూవ్మెంట్ ఆల్విన్ పర్యటించినట్లు ఏరియా డీజీఎం(పర్సనల్) రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా కైర్‌గూడ ఓసీపీని పరీశీలించిన అనంతరం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏరియా స్థితిగతులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా జీఎం దేవేందర్, ఎస్వోటూ జీఎం కృష్ణారావు, ఏజీఎం తిరుమల్‌రావు, పీవోలు శ్రీనివాస్, చంద్రశేఖర్, డీజీఎం(పర్సనల్) రాజేంద్రప్రసాద్, డీజీఎం(ఐఈడీ) యోహానా, సర్వే అధికారి చంద్రశేఖర్, ఎస్టేట్ అధికారి వరలక్ష్మి, ఐటీ మేనేజర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.