కోటపల్లి, మే 11 : కోటపల్లి మండలంలో 5 రోడ్లు, 9 బ్రిడ్జిల నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చిత్రపటాలకు పలు గ్రామాల ప్రజలు, నాయకులు పాలాభిషేకం చేశారు. కోటపల్లి మండల అభివృద్ధిలో భాగంగా రూ.40 కోట్లు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ జడ్పీ కో ఆప్షన్ సభ్యులు అజ్గర్ మొహియొద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ పెద్దపోలు సాంబాగౌడ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గుర్రం రాజన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎరినాగుల ఓదెలు, మండల యూత్ అధ్యక్షుడు మారిశెట్టి విద్యాసాగర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గతంలో ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి పనులను విప్ బాల్క సుమన్ పూర్తి చేస్తున్నారని కొనియాడారు. రెండేళ్లలో కోటపల్లి మండల రూపు రేఖలు మారనున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజారం సర్పంచ్ కొంక పోషక్క, ఉప సర్పంచ్ కల్వకుంట్ల తిరుపతి రావు, టీఆర్ఎస్ మండల నాయకులు దుర్గం కృష్ణదాస్, గాదె శ్రీనివాస్ తదితరులున్నారు.
నక్కలపల్లి గ్రామంలో..
కోటపల్లి మండంలోని మారుమూల గ్రామమైన నక్కలపల్లికి రోడ్లతో పాటు బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృతజ్ఞతగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మల్లంపేట-నక్కలపల్లి ప్రధాన రోడ్డుతో పాటు నక్కలపల్లి-పంగిడిసోమారం, నక్కలపల్లి-బద్ధంపల్లి రోడ్ల నిర్మాణంతో పాటు నక్కలపల్లికి వెళ్లేందుకు ఐదు బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెముగంటి రాజిరెడ్డి, గెల్లు వెంకన్న, కంకణాల సంపత్ రెడ్డి, మేడ తిరుపతి రెడ్డి, సూరం తిరుపతి రెడ్డి, నాయిని మల్లయ్య, రాఘవచారి, ఇరుగురాల రాజేందర్, ఇరుగురాల రాజేందర్, మహేశ్, అద్దరపల్లి మొండి, తెప్పల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.