కుంటాల, మే 11 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. దళారీ వ్యవస్థను నిర్మూలించి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం న్యాయం చేస్తున్నదన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. లారీలను సకాలంలో తెప్పించి తూకం పూర్తికాగానే నేరుగా రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
రైతులకు సకాలం లో డబ్బులు చెల్లించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం సూ చించిన పంటలను సాగుచేసి రైతులు అన్ని రకాలుగా లబ్ధి పొం దాలన్నారు. సర్పంచ్ సమతావెంకటేశ్, ఎంపీపీ గజ్జారాం, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జారాం, ఆర్బీఎస్ అధ్యక్షుడు శంకర్ గౌడ్, సీఈవో నాగభూషణ్, డీటీ నరేశ్ గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ తూర్పాటి వెంకటేశ్, ఆత్మ, సొసైటీ ఏఎంసీ డైరెక్టర్లు సబ్బిడి గజేందర్, ప్యాదరి భూమన్న, దశరథ్, చరణ్, గజ్జారాం, నారాయణ రావు పటేల్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, కుంటాల ఆర్బీఎస్ అధ్యక్షుడు మహేశ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓ రమేశ్, నాయకులు వెంకటేశ్, రమణా గౌడ్, హైమద్ పాషా, బోగ లక్ష్మణ్, రాకేశ్, శంకర్, సంతోష్, ఖదీర్ పాల్గొన్నారు.