ఎదులాపురం, మే 10 : వైద్య ఆరోగ్యశాఖలో పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తున్నామని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 40 స్టాఫ్ నర్సు పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్ఓఆర్ ప్రకారం పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు.
ఎంపికైన అభ్యర్థుల వివరాలను నోటీసు బోర్డుపై ఉంచుతామని తెలిపారు. ఇందులో ఎస్ఎన్సీయూ ఉట్నూర్‌లో 8, ఎస్ఎన్సీయూ రిమ్స్ లో 8, పీహెచ్‌సీల్లో 24 స్టాఫ్‌నర్సు పోస్టులకు ఇం టర్వ్యూ నిర్వహించామని వెల్లడించారు. 30 మం ది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యారని, ఎం పిక చేసిన వారికి నియామక పత్రాలు అందజేసినట్లు చెప్పారు. మిగతా 10 పోస్టులు ఖాళీగా ఉ న్నాయని తెలిపారు. ఎంపికైనవారు వారంలోగా జాయిన్ అవ్వాలని సూచించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఉట్నూర్ దవాఖాన సూపరింటెండెట్ ఉపేందర్జాదవ్, సోషల్ వెల్ఫేర్ శాఖ నుంచి ఏఎస్‌డబ్ల్యూవో నారాయణరెడ్డి పాల్గొన్నారు.
పాలియేటివ్ కేర్ విభాగంలో..
పాలియేటివ్ కేర్ విభాగంలో ఒప్పంద ప్రాతిపాధికన ఖాళీగా ఉన్న పోస్టులకు డీఎంహెచ్‌వో కార్యాలయంలో 12న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు నరేందర్ రాథోడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యాధికారి, ఫిజియోథెరపిస్టు, 5 స్టాఫ్‌నర్సు పోస్టులకు ఉదయం 10:30 గంటల నుంచి ఇంటర్వ్యూ ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు కనీసం రెండేండ్ల పాటు పాలియేటివ్ కేర్ విభాగంలో అనుభవం ఉండి, ఎంఎన్‌ఐ క్యా న్సర్ దవాఖాన హైదరాబాద్ ద్వారా ధ్రువీకరించిన అభ్యర్థులు మత్రమే అర్హులని పేర్కొన్నారు.