కుభీర్, మే 8 : రోజు రోజుకూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావన మరింత పెంపొందుతన్నదని, ఇది ఎంతో శుభ పరిణామమని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నారు. కుభీర్‌లోని భట్టిగల్లీ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం శిఖర స్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కలశ, శిఖర స్థాపన, ఆలయ ప్రాంగణంలో హోమం చేశారు. భైంసాకు చెందిన ప్రముఖ పురోహితులు గణేశ్ మహారాజ్ బృందం క్రతువులు నిరవ్హించారు. ధ్వజారోహణ అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. కాగా ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో పాటు ఆలయ కమిటీ అధ్యక్షుడు కందూరి చిన్న సాయినాథ్, డీసీసీ అధ్యక్షుడు పవార్ రామారావు పటేల్, భోస్లే మోహన్‌రావు పటేల్, సర్పంచ్ పానాజీ మీరా, విజయ్‌కుమార్, ఎంపీటీసీ బంక పోసాని, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, శంకర్ చౌహాన్, మార్క్ఫెఢ్ రాష్ట్ర డైరెక్టర్ రేకుల గంగాచరణ్, పీఏసీఎస్ వైస్ చైన్మన్ మెంచు రమేశ్, ఏఎంసీ చైర్మన్ కందూర్ సంతోష్, కందూరి బడా సాయినాథ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎన్నీల అనిల్, టౌన్ అధ్యక్షుడు బొప్ప నాగలింగం, శ్రీరాముల రాజేశ్‌చారి, దొంతుల గంగాధర్, డాక్టర్ గజ్జుసింగ్, మాజీ మండలాధ్యక్షుడు బొయిడి విఠల్, డాక్టర్ పీ శివరాం వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.