జైనథ్, మే 8: రాష్ట్రంలోటీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసే కాంగ్రెస్, బీజేపీ నుంచి నాయకులు,కార్యకర్తలు అధికార పార్టీలో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నా రు. జైనథ్‌లో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెం ట్ గడ్డం జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో 500 మంది నాయకులు, కార్యకర్తలు ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే జోగురామన్న కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబీమా, రైతుబంధు, 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నదని చెప్పారు. గతంలో రాష్ర్టాన్ని పాలించిన పార్టీలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని వివరించారు. ఇప్పటికైన ప్రతిపక్ష నాయకులు దిగజారుడు మాటలు మాని బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాయ సంస్థ చైర్మన్ మనోహర్, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఎస్ లింగారెడ్డి, సర్పంచ్ దేవన్న, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.