ఎదులాపురం, మే 7 : రిమ్స్‌లో ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా) సభ్యుడు ఆర్.అనిల్ కుమార్ గుప్తా శనివారం పర్యటించారు. రిమ్స్ కళాశాలకు సంబంధించిన 9ఎంఎస్ ఆర్థో పీజీ సీట్ల కోసం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ దరఖాస్తు చేశారు. దీంతో రిమ్స్‌లో ఎంఎస్ ఆర్థోపెడిక్ పీజీ సీట్లకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయో లేవోనని పరిశీలనకు వచ్చారు. ఎంసీఐ సభ్యుడు మొదటగా రిమ్స్ మెడికల్ కళాశాలలో పలు రికార్డులు, వసతులు పరిశీలించారు. పలు వివరాలు నమోదు చేసుకున్నారు. వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే పీజీ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. ఆయన వెంట వైద్యులు తిప్పస్వామి, అరుణ్, అవినాశ్, శ్యామ్ ఉన్నారు.