భైంసా/భైంసా టౌన్, మే 7 : ఈత, తాటి చెట్లు అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది కల్లు. ఈ కల్లు ద్వారా అనేక రకాల ప్రయోజనాలతోపాటు ఉత్పత్తులు తయారు చేయవచ్చు. ఇండ్ల నిర్మాణంలో తాటి మొగురాలకు వాడడం, తాటి ముంజలు, కాయల గుజ్జు, తాటాకులు, ఈత కొమ్మలు, ఈత పండ్లు దొరుకుతాయి. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ చెట్లను యథేచ్ఛగా నరికివేస్తున్నారు. తద్వారా తాటి, ఈత చెట్లు అంతరించి పోతున్నాయి. వీటిని నేటి సమాజం దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తులను ప్రోత్సహించి, ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కేసీఆర్ సర్కారు ముందుకు సాగుతున్నది. తాటి, ఈత వనాలు పెద్ద ఎత్తున పెంచడానికి హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్నారు. 2016 సంవత్సరం నుంచి తాటి, ఈత మొక్కలు నాటుతుండగా.. దాదాపు 10 లక్షలకుపైగా నాటారు. చెరువు గట్లు, ప్రభుత్వ స్థలాలు, ఖాళీ జాగలో ఈ చెట్లను పెంచుతున్నారు. దీని వల్ల గతంతో పోల్చితే హరితహారం కార్యక్రమం ద్వారా పెంచుతున్న చెట్లు ఎక్కువయ్యాయని గౌడ కులస్తులు సంబురపడుతున్నారు.
ఉత్పత్తి.. ప్రయోజనాలు..
మామూలు కల్లు మాదిరిగా నీరాను ఉత్పత్తి చేయరు. వాస్తవానికి చెట్టు నుంచి నేరుగా వచ్చేది కల్లు కాదు. పాలలాంటి ద్రవం. పాలల్లో తోడు వేసి పెరుగు ఎలా చేస్తారో.. చెట్టు నుంచి వచ్చే దానికి కల్లు(మడ్డి) కలుపుతారు. అప్పుడు అది కల్లు అవుతుంది. నీరా తీసే సమయంలో కల్లు తీసే కుండను(లొట్టి)ని సున్నపు తేటతో శుభ్రంగా కడుగుతారు. సాయంత్రం సమయంలో దానిని చెట్టుకు అమర్చుతారు. తెల్లవారు జామున నాలుగున్నర తర్వాత నీరాను సేకరిస్తారు. అలా తీసిన దాన్ని రెండు, మూడు గంటల్లో తాగేయాలి. లేకపోతే ఐస్బాక్స్ల్లో భద్రపరిచి ఇంట్లో ఫ్రిజ్లో ఉంచితే రంగు, రుచి కోల్పోకుండా తాజాగా ఉంటుంది. ఇందులో మత్తుపదార్థాలు ఉండవు కాబట్టి చాలా మంది దీనిని సేవించేందుకు ఇష్టపడతారు.
ఇందులో ప్రతి 100 మిల్లీలీటర్ల నీరాలో 264 కెసీయల్ ప్రొటీన్, పిండిపదార్థాలు, సున్నా శాతం కొవ్వు, లవణాలు, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాల్షియం, సోడియం, పొటాషియం ఉంటాయి. విటమిన్స్లో ఎస్మార్టీస్ ఆసిడ్, నికోటిన్, రీబోఫ్లోవిన్ మెండుగా ఉంటాయి. గెల నుంచి తీసిన నీరాలో కన్నా… కాయల నుంచి తీసిన నీరాలో పోషక విలువలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే మాంసకృత్తులు ఇతర పోషకాలు ఎన్నో నీరాలో ఉంటాయి. దీనిని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ప్రకృతి సిద్ధమైన సహజ పానీయం. దీనిని ఎవరైనా తాగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. తీపి ఆల్కహాల్ లేని పానీయం. అందువల్ల షుగర్ ఉన్న వారు కూడా తాగవచ్చు. ఇందులో సుక్రోజ్ ఉండడం వల్ల డయాబెటీస్ ఉన్నవారు, చిన్నపిల్లలు, గర్భిణులు కూడా సేవించవచ్చు. కాగా.. తెలంగాణ సర్కారు గౌడ కులస్తుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నీరా స్టాళ్లను కూడా ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ నిబంధనలు..
ఔషధ గుణాలు మెండు..