బేల, మే 7 : రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్, బీజేపీలు చేసిందేందని, అబద్ధపు మాటలతో ప్ర జలను మభ్యపెట్టాయని, ఆ పార్టీ నాయకులు గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రజలకు పిలుపునిచ్చా రు. బేలలోని ఇందిరానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన రెండో రేషన్ షాప్‌ను మండల నాయకులతో కలిసి శనివారం ప్రారంభించారు. బీజేపీ, కాంగ్రెస్ ఆబద్ధ్దపు మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్నారు. కల్లిబొల్లి మాటలు చెబుతూ పబ్బం గడపాలని చూస్తున్నారని, అలాంటి వారు గ్రామాల్లోకి వస్తే ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. గతంలో బేలలో దాదాపు 1500 పైగా రేషన్ కార్డు లభ్ధిదారులున్నారని, వారికి సరుకులు ఇవ్వాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు. ఇకపై అలాంటి సమస్యలు తలెత్తకుండా నూతనంగా మరో రేషన్ షాప్‌ను ప్రారంభించినట్లు చెప్పారు.
బేల గ్రామపంచాయతీకి ఈ ఏడాది దాదాపు 300 పైగా డబుల్ బెడ్రూం ఇండ్లు మం జూరు చేసి ఎన్నికల కంటే ముందే వాటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో అత్యంత నిరుపేదలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని, వారి వివరాలు సేకరించాలని సర్పంచ్‌కు సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, డీఎస్వో సుదర్శన్, డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, మాజీ సర్పంచులు దేవన్న, మస్కే తేజ్రావ్, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవార్, ఎంపీటీసీ ఓల్లఫర్ జ్యోతి, నాయకులు ప్రమోద్ రెడ్డి, జక్కుల మధుకర్, వాడ్కర్ తేజ్రావ్, తన్వీర్‌ఖాన్, విపిన్, సంతోష్, విఠల్, జీవన్, సంజయ్ నార్లవార్, సులేమాన్, సర్ఫరాజ్, తహసీల్దార్ బడాల రాంరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.