బాసర, మే 7: పండించిన వరి ధాన్యాన్ని రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే విక్రయించాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి సూ చించారు. బాసరలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం ఇటీవల అనారోగ్యం బారిన పడ్డ పుట్టి పెద్ద సాయిలు వైద్య ఖర్చుల కోసం మంజూరైన రూ.1.50 లక్ష ల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేశారు. పీఏసీఎస్ చైర్మన్ నర్సింగ్‌రావు, మండల ఉపాధ్యక్షుడు న ర్సింగ్‌రావు, సర్పంచ్ లక్ష్మణ్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్యామ్, నాయకులు రమేశ్, కా ర్తీక్రావు, జ్ఞానీపటేల్, సయ్యద్‌అలీ పాల్గొన్నారు.
నిధులు మంజూరు
భైంసాటౌన్, మే 7 : మండలంలోని కోతల్గాంలో రజక సంఘ భవన నిర్మాణానికి రూ.2.50 లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన మంజూ రు పత్రాన్ని దేగాంలో స్థానికులకు అందజేశారు. ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, మేరాజ్ ఉన్నారు.
అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట
కుభీర్, మే 7 : రాష్ట్రం ఏర్పాటయ్యాకే మహిళలకు సముచిత గౌరవం లభించిందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి స్పష్టం చేశారు. కుభీర్‌లోని ఐకేపీ కార్యాలయంలో మండలంలోని మహిళా (డ్వాక్రా) సంఘాలకు రూ.3.5 కోట్ల బ్యాంకు రుణాలు, రూ.కోటి స్త్రీనిధి రుణాల చెక్కులను ఆయన డీఆర్డీవో విజయలక్ష్మితో కలిసి పంపిణీ చేశారు. మహిళలపై గౌరవంతోనే ప్రతి పథకం మహిళల బ్యాంకు ఖాతాల్లోకే నగదు జమచేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీఎం రమేశ్, ఎంపీడీవో ఎల్.రమేశ్, జడ్పీటీసీ అల్కాతాయి, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, సింగిల్‌విండో చైర్మన్ గంగాచరణ్, ఏఎంసీ చైర్మన్ కందూర్ సంతోష్, మండల సమాఖ్య అధ్యక్షురాలు మాల్వే లత, ఎంపీటీసీలు శ్యాంరావు, దొంతుల దేవిదాస్, బంక పోసాని, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, యూబీఐ అధికారులు, డీపీఎం విజయలక్ష్మి, నాయకులు సంజయ్ చౌహాన్, అనిల్, మహిళలు, ఐకేపీ, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి..
మండలంలోని రాంనాయక్ తండాకు చెందిన ఆడే రాంచందర్, రాథోడ్ భిక్కు, సాయినాథ్, వైజేనాథ్ బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీకి కార్యకర్తలే పునాది లాంటివారని, వారికి అవకాశం వచ్చినప్పుడల్లా పార్టీ, ప్రభుత్వ పదవుల్లో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, జడ్పీటీసీ అల్కాతాయి చౌహాన్, సంజయ్ చౌహాన్, శంకర్ చౌహాన్, పీ విజయ్‌కుమార్, గిరిజన యువకులు, తండా వాసులు పాల్గొన్నారు.