బేల, ఏప్రిల్ 26: జైనథ్ మహిళా ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించిన బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌పై చర్యలు తీసుకోవాలని ఎంపీపీ వనిత ఠాక్రే డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పాయల శంకర్‌కు వ్యతిరేకంగా మహిళలు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడితో పాటు ఆ పార్టీ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, మండల అధ్యక్షుడు కే ప్రమోద్ రెడ్డి , ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవార్ , రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు జక్కుల మధుకర్, మహిళా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు రుక్సానా బేగం, నాయకులు విశాల్ , విఠల్, తన్బా, సుధాకర్ పాల్గొన్నారు.
ఉట్నూర్, ఏప్రిల్ 26 : మహిళా ఎస్ఐపై దుర్భాషలాడి, దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకురాలు జాదవ్ సుమన్‌బాయి అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ ఎస్ఐని దూషించడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌక్‌లో మహిళలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సుమన్‌బాయి మాట్లాడారు. మహిళా ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించడం తగదన్నారు. అటువంటి నాయకులు మహిళలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సదరు నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళలు ఉన్నారు.