
నార్నూర్, జూలై 7 : పల్లె ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములవ్వాలని, లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. మండలంలోని జామడ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగ తి, హరితహారం కార్యక్రమంలో ఆదిలాబాద్ జ డ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ నాం దేవ్ కాంబ్లే, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. పలు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే సక్కు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆమె స్పందించి, తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు శ్మశానవాటిక, సెగ్రిగేషన్ షెడ్డు, డంప్‌యార్డును పరిశీలించారు. జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. ఇం టికి ఆరు మొక్కలు నాటి పెంచాలని సూచించా రు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు సూచించారు. అనంతరం ప్రభుత్వం మంజూరుచేసిన రైతు బీమా పథకం ప్రొసీడింగ్‌ను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్డీవో కిషన్, ప్రత్యేకాధికారి శ్రీనాథ్, ఎంపీపీ కనక మోతుబాయి, సర్పంచ్ మడావి ముక్తారూప్దేవ్, తహసీల్దార్ దుర్వ లక్ష్మణ్, ఎంపీడీవో రమేశ్, ఎఫ్ఆర్వో అనిత, ఎంపీవో స్వప్నశీల, ఏపీవో జాదవ్ శేషారావ్, ఏవో గిత్తే రమేశ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావ్, రాయి సెంటర్ జిల్లా సార్మెడి దుర్గుపటేల్, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఉన్నారు.