రామకృష్ణాపూర్, ఏప్రిల్ 13: కళాకారులను ప్రోత్స హించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంచిర్యాలకు చెందిన కళాభిమాని కట్టోజు మురళి, సుజా త దంపతుల కుమార్తె జాహ్నవి (గాయని) వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డుకు ఎంపికైంది. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని క్యాతనపల్లి మున్సిపాలిటీలోని అమ్మ గార్డెన్లో బుధవారం ఏర్పాటు చేశారు. జాహ్నవికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ ప్రతి నిధులు రంగజ్యోతి, మడుపు రామ్ ప్రకాశ్ అవార్డు అంద జేశారు. ఇటీవల 17 భాషల్లో పాటలు పాడి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డుకు జాహ్నవి ఎంపికైంది. గుండేటి యోగేశ్వర్, వెంకట్, రాజు వ్యాఖ్యాతలుగా వ్యహవరిం చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, డీసీపీ అఖిల్ మహాజన్, కౌన్సిలర్ అలుగుల శ్రీలత, నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, బోయినపల్లి నర్సింగరావు,గాండ్ల సమ్మయ్య, కళాకారులు పాల్గొన్నారు.
మంత్రి ఐకే రెడ్డికి ఘన స్వాగతం
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 13: ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించేందుకు బుధవారం మంచిర్యాల జిల్లాకు వచ్చిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి నాయకులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌లో మంత్రి ఐకే రెడ్డికి మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, ఎమ్మెల్యే తనయుడు విజిత్‌రావు, టీఆర్ఎస్ నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో కౌన్సిలర్లు సుదమల్ల హరికృష్ణ, గాదెసత్యం, పీఏసీఎస్ చైర్మన్ ఎస్ వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకులు గొంగళ్ల శంకర్, తోట తిరుపతి, గట్టయ్య, సుధీర్, జెట్టి చరణ్‌దాస్, సత్యపాల్‌రెడ్డి, పడాల శ్రీనివాస్, రాజ్‌కుమార్ ఉన్నారు.
హోటల్‌ను సందర్శించిన మంత్రి, ఎమ్మెల్సీ
మంచిర్యాలకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు గొంగళ్ల శంకర్ అల్లుడు, కూతురు గురువింద్-ప్రణీత ఏర్పాటు చేసిన పంజాబీ దాల్‌ఫ్రై హోటల్‌ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ విఠల్ బుధవారం సందర్శించారు. వారివెంట మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య ఉన్నారు.