
బోథ్, జనవరి 27: టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే జోగు రామన్నను నియమిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో బోథ్ మండల ప్రజాప్రతినిధులు గురువారం ఆదిలాబాద్‌లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. బోథ్ మండలంలో పార్టీ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామన్నారు. ఇక్కడ సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు బీ శ్రీధర్‌రెడ్డి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు ఉన్నారు. కౌఠ(బీ) గ్రామానికి చెందిన వీడీసీ వైస్‌చైర్మన్ రమేశ్, కన్గుట్టకు చెందిన నాయకులు జోగు రామన్నను కలిసి సన్మానించారు.
ఆదిలాబాద్ రూరల్, జనవరి 27: తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మెల్యే జోగు రామన్నను ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు గాడ్గే సుభాష్ ఆదిలాబాద్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింత పటిష్టపర్చడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయేందుకు తమవంతు సహకారం అందిస్తామని సుభాష్ తెలిపారు.
భీంపూర్, జనవరి 27: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎన్నికైన నేపథ్యంలో తాంసి మండలం వడ్డాడి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు మహేందర్, ప్రకాశ్, భీంపూర్ మండల నాయకులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
నేరడిగొండ, జనవరి 27 : జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మెల్యే జోగు రామన్నను నేరడిగొండ జడ్పీటీసీ జాదవ్ అనిల్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ఇక్కడ మాజీ జడ్పీటీసీ సయ్యద్ జహీర్, ఇచ్చోడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తిరుమల్‌గౌడ్, నాయకులు శంకర్ ఉన్నారు.