లక్ష్మణచాంద, ఏప్రిల్ 13 : పల్లెలు పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. మండలంలోని కనకాపూర్, రాచాపూర్, పీచర గ్రామాల్లోని మురుగు కాలువలు, రహదారి వెంట నాటిన మొక్కలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లోని మురుగు కాలువల్లో పూడికతీత పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. రోడ్ల వెంట నాటిన మొక్కలకు నీరు పోయాలని, మొక్కలను సంరక్షించడానికి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, తహసీల్దార్ కవితారెడ్డి, ఎంపీడీవో మోహన్, ఎంపీవో నసీరోద్దీన్, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.