ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 26 : నేడు నిర్వహించే పల్స్ పోలియోను విజయవంతం చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో వైద్య సిబ్బంది, రూట్ అధికారులతో పల్స్ పోలియోపై శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంద్రవెల్లి పీహెచ్సీ పరిధిలో 3,800 మంది ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించామన్నారు. ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాల్లో నియమించిన 174 మంది వైద్య సిబ్బంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ప్రత్యేక ఆటో ద్వారా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, వైద్య సిబ్బంది శ్రీనివాస్, బలరాం పాల్గొన్నారు.
ఉట్నూర్, ఫిబ్రవరి 26 : ఉట్నూర్ డివిజన్ పరిధిలోని గాదిగూడ, ఝరి, నార్నూర్, దంతన్‌పల్లి, హస్నాపూర్, ఇంద్రవెల్లి, పిట్టబొంగురం, శ్యాంపూర్ పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో పల్స్ పోలియోకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏజెన్సీ ఇన్చార్జి వైద్యాధికారి విజయ్ తెలిపారు. ఇందుకోసం కేంద్రాలకు సిబ్బందిని కేటాయించామని పేర్కొన్నారు. 28, మార్చి 1న ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేస్తారని తెలిపారు.
నార్నూర్, ఫిబ్రవరి 26 : గాదిగూడ, ఝరి, నార్నూర్ పీహెచ్‌సీల పరిధిలో మూడు మొబైల్ టీంలు, 84 బూత్‌లు, తొమ్మిది రూట్లు ఏర్పాటు చేశామని మెడికల్ అధికారి పవన్ కుమార్ తెలిపారు. 6,804 మంది ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు.
బోథ్, ఫిబ్రవరి 26 : మండలంలోని 33 గ్రామ పంచాయతీల పరిధిలో 4,076 మంది ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్నట్లు సొనాల పీహెచ్సీ డాక్టర్ నవీన్‌రెడ్డి తెలిపారు. మండలాన్ని ఆరు రూట్లుగా విభజించి 56 పోలియో కేంద్రాలు, ఒక మొబైల్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు 224 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. ప్రజలు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
ఇచ్చోడ, ఫిబ్రవరి 26 : మండల కేంద్రంలో ప్రభుత్వ దవాఖాన ఆధ్వర్యంలో పల్స్ పోలియోపై ఆటో ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి ఆకుదారి సాగర్ మాట్లాడుతూ ఇచ్చోడ దవాఖాన పరిధిలో మూడు రూట్లుగా విభజించి 35 బూతుల్లో 3,900 మంది ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించామని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కళావతి, హెల్త్ అసిస్టెంట్ రాథోడ్ కైలాస్, ప్రభావతి, జాదవ్ సుభాష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నేరడిగొండ, ఫిబ్రవరి 26 : మండలంలోని అన్ని గ్రామా ల్లో బూత్‌ల వారీగా నాలుగు రూట్లలో మొబైల్ టీం తిరిగేలా చర్యలు తీసుకున్నామని వైద్యాధికారి ఆనంద్ కుమార్ తెలిపారు. మూడు రోజుల పాటు ఇంటింటికీ తిరిగి వందశాతం పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
బజార్హత్నూర్, ఫిబ్రవరి 26: మండలంలో ఆదివారం నిర్వహించే పల్స్ పోలియోను విజయవంతం చేయాలని పీహెచ్సీ వైద్యాధికారి సురేశ్ పిలుపునిచ్చారు. మండలంలోని పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలతో పాటు జనసంచార ప్రదేశాల్లో పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.