ఇంద్రవెల్లి, జనవరి 26 : మండలంలోని అందునాయక్తండాలో భగవతి జ్వాలాముఖి దుర్గామాత ఆలయం 17వ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించారు. మండలకేంద్రం నుంచి వేలాదిమంది భక్తులు, మహిళల ఆధ్వర్యంలో కలశంతో భారీ శోభాయాత్ర తీశారు. వేలాదిమంది భక్తులతో మండలకేంద్రం కిక్కిరిసింది. మహిళలు భగవత్గీత, కలశంతో భారీ ఊరేగింపు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అసంఘ్దేవ్జీ మహారాజ్‌ను ప్రత్యేక రథంలో మండలకేంద్రం నుంచి అందునాయక్తండా వరకు ఊరేగించారు. శోభాయాత్ర సుమారు మూడు కిలోమీటర్ల మేర కనుల పండువగా సాగింది. ఎమ్మెల్యే రేఖానాయక్ భక్తులతో కలిసి నృత్యం చేశారు. యువతీ, యువకులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అందునాయక్తండాలోని భగవతి జ్వాలాముఖి దుర్గామాత ఆలయానికి చేరుకున్న అసంఘ్దేవ్జీ మహారాజ్‌కు పూల వర్షంతో స్వాగతం పలికారు. అనంతరం మహారాజ్‌ను ఎమ్మెల్యే రేఖానాయక్ శాలువాతో సన్మానించి ఆశీర్వాదం పొందారు. అనంతరం ఆధ్యాత్మిక సప్తాహాన్ని ప్రారంభించారు. అసంఘ్దేవ్జీ మహారాజ్ భక్తులకు ఆధ్మాత్మిక ప్రవచనాలు, మార్గాలను బోధించారు. ఈ సప్తాహం ఈ నెల 30 వరకు కొనసాగుతుందని ఆలయ మహారాజ్ రాంసింగ్బాబా తెలిపారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, ఎంపీపీ పోటే శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతీ పటేల్ డోంగ్రే, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, వైస్ ఎంపీపీ పడ్వాల్ గో పాల్‌సింగ్, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, ఆశాబాయి, సర్పంచ్ గాంధారి, శారద పాల్గొన్నారు.