సోన్, ఏప్రిల్ 6 : రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రం మెడలు వంచే వరకూ టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిని బుధవారం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు దిగ్బంధించారు. వీరికి నాగలి, వరి కంకులతో మంత్రి అల్లో ఇంద్రకరణ్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరి వేయాలని రైతులను మోసం చేసిన స్థానిక బీజేపీ నాయకులు ఇప్పుడెటు పోయారని ప్రశ్నించారు. కేంద్రం వడ్లు కొనబోమని చెబుతుంటే, ఒక్క మాట మాట్లాడకుండా, రాష్ట్ర సర్కారుపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలోని రైతులను కేంద్ర మంత్రి చులకన చేసి మాట్లాడుతుంటే, కనీసం స్పందించకపోవడం బాధాకరమన్నారు. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసినప్పుడు తెలంగాణలో ఎందుకు కొనరని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణగౌడ్, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు కోట నర్సింహారెడ్డి, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు గండ్రత్ ఈశ్వర్, రాజేందర్, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ సోన్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, రవీందర్‌రెడ్డి, నర్సారెడ్డి, చంద్రశేఖర్‌గౌడ్, రైతు బంధు కమిటీ కన్వీనర్లు ధర్మాజి శ్రీనివాస్, మల్లేశ్, నిర్మల్, భైంసా, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు నర్మదా ముత్యంరెడ్డి, కృష్ణ, రవీందర్‌రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజి రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్లు అంపోలి కృష్ణప్రసాద్‌రెడ్డి, రమణారెడ్డి, మాణిక్‌రెడ్డి, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌చారి, నిర్మల్ టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, మున్సిపల్ చీఫ్ విప్ నేరేళ్ల వేణు, నాయకులు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.