ఇచ్చోడ, ఏప్రిల్ 6 : రాష్ట్రంలో పండించిన ధాన్యం కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేసే దాకా ఉద్యమిస్తామని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. అదిష్టానం పిలుపు మేరకు మండల కేంద్రంలోని జాతీయ రహదారిని బుధవారం నాలుగు మండలాల టీఆర్ఎస్ నాయకులు దిగ్బంధించారు. ఎండను లెక్క చేయకుండా జాతీయ రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై కక్షసాధింపు చర్యలకు పూనుకుందన్నారు. యాసంగిలో పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జాతీయ రహదారి దిగ్బంధంతో ఇటు నిర్మల్, అటు ఆదిలాబాద్ వైపు వందలాది వాహనాలు స్తంభించిపోయాయి. కార్యక్రమంలో ఇచ్చోడ, గుడిహత్నూర్, బజార్హత్నూర్, సిరికొండ మండలాలకు చెందిన టీఆర్ఎస్ కన్వీనర్లు ఏనుగు కృష్ణారెడ్డి, కరాడ్ బ్రహ్మానందం, బాలాజీ, మాజీ ఎంపీపీ సుభాష్ పాటిల్, రాథోడ్ సూర్య ప్రకాశ్, ఇచ్చోడ డివిజన్ ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, రైతు బంధు సమితి మండలాల అధ్యక్షులు ముస్తాఫా, బత్తుల అశోక్, కైలాస్, నాయకులు సుభాష్, దాసరి భాస్కర్, బీపీఆర్, సూర్యకాంత్ చౌహాన్, గుంజాల భాస్కర్ రెడ్డి, వెంకటేశ్, గ్యాతం గంగయ్య, గుండాల శ్రీకాంత్, నర్సారెడ్డి, మహిళా నాయకురాలు సోంబాయి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
రైతులపై చిన్నచూపు తగదు
నేరడిగొండ, ఏప్రిల్ 6 : రైతు సమస్యలపై కేంద్రం చిన్నచూపు చూస్తున్నదని, యాసంగి ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమాలు చేపడుతామని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బోథ్, నేరడిగొండ మండలాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో నేరడిగొండ జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఎంపీపీలు తుల శ్రీనివాస్, రాథోడ్ సజన్, ఏఎంసీ చైర్మన్ భోజన్న, సర్పంచ్‌లు సురేందర్ యాదవ్, వెంకటరమణ, జాదవ్ సుభాష్, రాజు, జాదవ్ రమేశ్, వైస్‌ఎంపీపీ మహేందర్ రెడ్డి, నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి, రమేశ్, సయ్యద్ జహీర్, దేవేందర్ రెడ్డి, జాదవ్ వసంత్‌రావ్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.