ఇంద్రవెల్లి, ఏప్రిల్6 : టీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని ముత్నూర్‌లో హనుమాన్ ఆల యం నుంచి దుర్గాదేవి ఆలయం వరకుచేపట్టిన సీసీరోడ్డు నిర్మాణానికి ఆయన బుధవారం భూమిపూజ చేశారు. అనంతరం దుర్గాదేవి ఆలయంలో జడ్పీ చైర్మన్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధితోపాటు భక్తులకు కల్పించే సౌకర్యాలపై గ్రామస్తులతో చర్చించారు. అనంతరం గ్రామస్తులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, సర్పంచ్ తుంరం బాగుబాయి, ఎంపీటీసీలు కోవ రాజేశ్వర్, పడ్వాల్ విజయ్‌సింగ్, మాజీ ఎంపీటీసీ కనక హనుమంత్‌రావ్, జీవ వైవిధ్య కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి, ముత్నూర్ గ్రామ పటేల్ హెచ్‌కే జంగుపటేల్, నాయకులు షేక్ సూఫియాన్, ఆర్కా ఖమ్ము, దేవేందర్, ఉల్లాస్ గౌడ్, శివకుమార్ జైస్వాల్, తుంరం మారుతి పాల్గొన్నారు.