సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 2: వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడంపై నిర్వాహకులను మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అభినందించారు. సీసీసీ కార్నర్ వద్ద వరక్త సంఘం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. నిర్వాహకులు ఉగాది నీటితో పాటు పచ్చడి, బూరెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కౌన్సిలర్లు వంగ తిరుపతి, రేగుంట చంద్రశేఖర్, బోయ మల్లయ్య, మొగిలి, వర్తక సంఘం సభ్యులు మల్లారెడ్డి, సిరిపురం ధర్మయ్య, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేని శంకర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మెరుగు పవన్‌కుమార్, నాయకులు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, అన్నయ్య, ఏనుగు రవీందర్‌రెడ్డి, దెబ్బటి రామన్న, జాడి భానుచందర్, పెర్క సత్తయ్య, పంబాల ఎర్రయ్య, ఇరికిళ్ల పురుషోత్తం, కొప్పర్తి రాజం, జాబ్రిగౌస్, గర్శె రామస్వామి, జక్కుల రాజేశం, గర్శె భీమయ్య, కొయ్యల కొమురయ్య, దగ్గుల మధు, చెల్ల విక్రం, కాటం రాజు, కోగిల సందీప్, వెంగల కుమారస్వామి, రామిడి మహేందర్‌రెడ్డి, తదితరులున్నారు.
లక్షెట్టిపేట రూరల్, ఏప్రిల్ 2 : పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, సబ్ జైల్ సూపరింటెండెంట్ స్వామి, నాయకులు చెట్ల రమేశ్, గుండా సత్యనారాయణ, కటకం రమేశ్, విశ్వనాథం, మనోహర్, సంగర్స్ ఆనందరావు, సీహెచ్ రమేశ్, నార్ల సుమతి, గంప రవీందర్, నగధర్, శ్రీనివాస్, రాంసింగ్, కాసం రవీందర్, లింగమూర్తి, సుధాకర్, రాజయ్య, గంగాధర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి మండలంలో..
కోటపల్లి, ఏప్రిల్ 2 : మండలంలోని రాపనపల్లిలో చలివేంద్రాన్ని రైతు బంధు సమితి మండల కన్వీనర్ గుర్రం రాజన్న, సర్పంచ్ గుర్రం లక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కమల్ గ్రామస్తులు పాల్గొన్నారు.
చెన్నూర్ మండలంలో..
చెన్నూర్ రూరల్, ఏప్రిల్ 2 : మండలంలోని కిష్టంపేటలో బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చెన్నూర్ ఎంపీపీ మంత్రి బాపు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లెల దామోదర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చల్ల రాంరెడ్డి, సర్పంచ్ బుర్ర రాకేశ్ గౌడ్, వార్డు సభ్యులు కొప్పర్తి రవి పాల్గొన్నారు.
తాండూర్ మండలంలో..
తాండూర్, ఏప్రిల్ 2 : మండలకేంద్రం ఐబీలో కొత్తపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం జడ్పీటీసీ సాలిగామ బానయ్య, సర్పంచ్ ఏల్పుల రజిత, ఎంపీటీసీ సిరంగి శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చీర్ల రాజేశం, నాయకులు ఏల్పుల రాజు, పెద్దబోయిన మల్లేశ్, సంతోష్, మంతెన శివకుమార్, వార్డు సభ్యులు, తదితరులు ఉన్నారు.