ఎదులాపురం, ఏప్రిల్ 1 : సర్కారు బడుల్లో మౌ లిక వసతులు కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ‘మ న బస్తీ – మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అ న్నారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి ఖుర్షీద్నగర్ ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాల లో రూ.11.43 లక్షలతో చేపడుతున్న పలు పనులకు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 237 ప్ర భుత్వ పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, నీటి సరఫరా, తదితర పనులు చేపడుతామన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేకాధికారి నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు పనులు చేపడుతాయని అం దుకు అంచనాలు సిద్ధం చేశామని చెప్పారు. పనులను సంబంధిత ఏజెన్సీలు త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. పేద, సంపన్న వర్గాల పిల్లలు కూడా చదవుకునేందుకు వీలుగా వసతులు కల్పిస్తున్నామన్నారు. అనంతరం విద్యాశాఖ అధికారులు, స్థానిక వార్డు సభ్యులు కలెక్టర్, ఎమ్మెల్యేను శాలువాతో సత్కారించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జో గు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, జడ్పీ డిప్యూటీ సీఈవో రాజేశ్వర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, డీఈవో ప్రణిత, కౌన్సిలర్లు అ ధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.